పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన రాములమ్మ .. సొంత పార్టీ నేతలపై ఫైర్

88
Vijayasanthi Comments on Governor
vijayashanti, warning, kcr, trs party, governor , telangana people

VIJAYASANTHI CLARITY ON PARTY CHANGE

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీగా పావులు కదుపుతున్న బీజేపీ ఆపరేషన్ ఆకర్ష అంటుంది. కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి కూడా బిజెపి తీర్ధం పుచ్చుకోనున్నారు అన్న చర్చ తెలంగాణ రాష్ట్రంలో జోరుగా సాగింది. ఇటీవల కాలంలో బిజెపి తీసుకుంటున్న నిర్ణయాలతో విజయశాంతి ఏకీభవించడం బిజెపి నేతలు చేసిన వ్యాఖ్యలకు అనుకూలంగా ఆమె స్పందించడం వంటి కారణాలతో ఆమె పార్టీ మారుతున్నారు అన్న భావన చాలా మంది రాజకీయ నాయకుల్లో కలిగింది. అయితే ఈ విషయంపై రాములమ్మ క్లారిటీ ఇచ్చేశారు. తన మీద జరుగుతున్న ప్రచారానికి గల కారణాలను ఆమె కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు.
కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి పార్టీ మారుతారని సాగిన ప్రచారం పై స్పందించిన విజయశాంతి తనకు పార్టీ మారే ఆలోచన ఏమాత్రం లేదని, ఒకవేళ అలా ఉంటే బహిరంగంగా ప్రకటించిన తర్వాతే వెళతానని పేర్కొన్నారు. గాంధీభవన్‌‌లో కొందరు తనపై కావాలని కుట్ర చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారన్న వార్తలను ఖండించిన ఆమె మీడియాతో మాట్లాడుతూ, తాను పార్టీ మారుతున్నానన్న ప్రచారం గాంధీ భవన్ లోనే ప్రారంభమైందని ఆరోపించారు. పార్టీ విడిచి వెళ్లాలనుకుంటే బహిరంగంగానే ప్రకటిస్తానన్నారు. ఇక ఇదే విషయాన్ని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా స్పష్టంగా చెప్పానని పేర్కొన్న విజయశాంతి తానెప్పుడూ హడావుడి నిర్ణయాలు తీసుకోనని స్పష్టం చేశారు .
గతంలో విజయశాంతి బీజేపీలో పని చేయడం, ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బాగా బలహీనపడటం, బిజెపి బలం పుంజుకోవడం, ఇక తాజాగా విజయశాంతి చేస్తున్న పోస్టులు అన్నీ విజయశాంతి పార్టీ మారతారని అభిప్రాయానికి ఊతం ఇచ్చాయి. ఇటీవల ఇక తమ జోలికి ఎవరూ రాకుండా ఉండాలని అవినీతి ఆరోపణలు చేస్తే పరువు నష్టం కేసులు పెడతామని కేసీఆర్ ప్రభుత్వం బెదిరించిందని, ఈ నేపథ్యంలో కేసీఆర్‌ పాలనపై కేంద్రం నిఘా పెట్టిందని విజయశాంతి చెప్పటం, కేసీఆర్ ప్రభుత్వంలోని అవకతవకలపై సమాచారం సేకరిస్తుందని బీజేపీ నేతలు ప్రకటించడాన్ని రాష్ట్ర ప్రజలు మంచి పరిణామంగా భావిస్తున్నట్లు ఆమె పేర్కొనటం కూడా విజయశాంతి బీజేపీ విషయంలో అనుకూలంగా ఉన్నారని ప్రచారం జరగటానికి కారణం . అంతేకాక విజయశాంతికి ఇప్పటివరకు బీజేపీలోని కేంద్ర నేతలతో మంచి పరిచయాలు ఉన్నాయి. ఇప్పటికీ ఆమె వాటిని అలానే కొనసాగిస్తున్నారని అనుచరులు అంటున్నారు. ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్‌లో న్న విజయశాంతి అది పూర్తవ్వగానే బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను సైతం ఆమె కలిసి ఆలోచనలో ఉన్నారని జోరుగా వార్తలు వినిపించాయి. కానీ విజయశాంతి తనపై వస్తున్న పుకార్లకు చెక్ పెడుతూ ఏదైనా నిర్ణయం తీసుకుంటే బహిరంగంగా ప్రకటించి తీసుకుంటానని తేల్చి చెప్పేశారు.

KCR YADADRI  TOUR

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here