శిశుపాలుడి తప్పుల్ని మించి తప్పులు చేస్తున్న గులాబీ సర్కార్ ..

VIJAYASANTHI FIRES ON TRS PARTY CORRUPTIONS

కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ విజయశాంతి మరొకసారి టీఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్రమైన విమర్శలు చేశారు… టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న తప్పులు శిశుపాలుడి తప్పుల్ని మించిపోతున్నాయని విజయశాంతి మండిపడ్డారు . కెసిఆర్ తీసుకుంటున్నటువంటి విషపూరితమైన చర్యలను, రాజ్యాంగ వ్యతిరేక చర్యలను ప్రతిపక్షాలు తప్పుబట్టినప్పటికీ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మాత్రం అవేమి పట్టించుకోవడం లేదని, తన దారి తనదే అన్నట్టు కెసిఆర్ వ్యవహరిస్తున్నారని విజయశాంతి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అధికారం రావడంతో కెసిఆర్ కి కళ్ళు ముసుకపోయాయని విజయశాంతి అన్నారు. దీనికి తోడు ప్రభుత్వ నిర్ణయాలను తప్పు పడితే కేసులు పెట్టి జైలుకు పంపుతామని కేసీఆర్ అందరిని హెచ్చరించారని విజయశాంతి ఆరోపణలు గుప్పించారు .

అయితే ప్రభుత్వ జీవోలను రద్దు చేసిన సందర్భాలు ఉన్నప్పటికీ కూడా కెసిఆర్ మాత్రం ఆ విషయాల్లో స్పందించకపోవడం అనేది చాలా దారుణమని విజయశాంతి వాపోయారు. ఇప్పటికి కూడా కెసిఆర్ తన మొండి వైఖరిని తెలంగాణ ప్రజల మీద చూపిస్తున్నారని, కెసిఆర్ చూపిస్తున్న ధోరణి వల్ల తెలంగాణ ప్రజలు చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారని విజయశాంతి ఆరోపించారు. ఇన్నిరోజులు కెసిఆర్ చేసే పనులకు మద్దతు ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కూడా చివరికి తన వైఖరిని మార్చుకున్నారని పేర్కొన్న విజయశాంతి , ఇక మారాల్సింది కెసిఆర్ ఒక్కడే అని గట్టిగానే చెప్పారు. ఒకవేళ మారకపోతే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని విజయశాంతి హెచ్చరించారు.

NOTICES FOR BIGBOSS

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *