విజయశాంతి బీజేపీలో చేరే ఛాన్స్.. ఎందుకంటే

162
Vijayasanthi Comments on Governor
vijayashanti, warning, kcr, trs party, governor , telangana people

Vijayasanthi ill Join BJP ?

తెలంగాణలో ఈ సారి జరిగిన ముందస్తు ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో వరుసగా రెండో సారి గెలిచి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ పొత్తులో సైతం కేవలం 19 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. అయితే గెలిచిన ఎమ్మెల్యేలు కూడా సగానికి పైగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీనీ వీడి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. అయితే మొన్న జరిగిన లోక్‌సభ ఎన్నికలలో 3 ఎంపీ సీట్లు గెలిచినా పార్టీలోని నేతలు మాత్రం టీఆర్ఎస్ పై దూకుడు చూపించలేకపోతున్నారు .

అయితే కాంగ్రెస్ మహిళా నాయకురాలు, స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి పార్టీ మారుతున్నారన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ సారి తాను ఎన్నికలలో పోటీ చేసే అవకాశం కల్పించకపోవడం, పార్టీలోని సీనియర్ నేతల పెత్తనం పెరిగిపోవడం, పదవుల కోసమే కానీ పార్టీ కోసం పనిచేయని నేతల మధ్య విసుగు చెందిన విజయశాంతి ఇక పార్టీలో ఉండడానికి ఇష్టపడడంలేదని త్వరలోనే ఈమె కాంగ్రెస్ పార్టీనీ వీడీ బీజేపీలో చేరిపోతున్నారని సమాచారం. అయితే విజయశాంతి గతంలో బీజేపీలో కూడా ఉండడం, పార్టీలోని పెద్దలతో మంచి పరిచయాలు ఉండడంతో వారిని కలిసే పనిలో ఉన్నారని, ప్రస్తుతం ఈమె ఒక సినిమా షూటింగ్‌లో ఉండడంతో అది పూర్తవ్వగానే అమిత్ షాను కలవబోతున్నారని సమాచారం. అంతేకాదు ఇప్పటికే ఈమెతో పలువురు బీజేపీ జాతీయ నాయకులు సంప్రదింపులు కూడా జరిపారని త్వరలోనే ఈమె తన అభిమానులతో చర్చించి పార్టీనీ వీడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

Pallam Raju as AP PCC Chief

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here