బీజేపీలోకి రాములమ్మ?

#Vijayashanthi join in BJP#

గ్లామర్ ఫీల్డ్ ను పక్కనపెట్టి రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యింది విజయశాంతి. కొన్నేళ్లు రాజకీయాల్లో చురుగ్గా ఉన్నప్పటికీ, ఈ మధ్య మాత్రం ఎక్కడా కూడా రాములమ్మ కనిపించడం లేదు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ గా బాధ్యతలు చేపట్టినా కాంగ్రెస్ కు అంటిముట్టనట్టుగానే ఉంది. ఆమె ఎందుకు సైలంట్ ఉంది? అమె అడుగులు ఎటు పడుతాయోనని అమె అభిమానులు, రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. దీనికి కారణంగా తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో భేటీ కావడమే. రెండు రోజుల క్రితం విజయశాంతి నివాసానికి వెళ్లి ఆమెతో భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు ఇరువురూ చర్చలు జరిపారు.

గతంలో ప్రాతినిధ్యం వహించిన ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికల ప్రచారానికి వెళ్లకపోవడం, చాలాకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న నేపథ్యంలో కిషన్‌రెడ్డితో భేటీ రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. మళ్లీ బీజేపీలోకి రావాలని, బీజేపీలోకి వస్తే స్థాయిని మించి ప్రమోట్ చేస్తామని, రాములకు హోదాకు తగ్గ పదవి ఇస్తామని కిషన్ రెడ్డి రాములమ్మతో చెప్పినట్లు సమాచారం. విజయశాంతి కాంగ్రెస్ పార్టీ పెద్దల పట్ల విముఖత చూపిస్తున్నారు. కాంగ్రెస్ లో తగిన గుర్తింపు లేనందు వల్లే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటారు. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి భేటీ కావడంతో మళ్లీ విజయశాంతి బీజేపీలో చేరుతుందా? అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *