విజయవాడలో ఫ్లాట్ల రేట్లు?

101
VIJAYAWADA FLAT RATES
VIJAYAWADA FLAT RATES

నిన్నటివరకూ విజయవాడలో రియల్ మార్కెట్ మూడు పూవులు ఆరు కాయలుగా విరాజిల్లేది. అలాంటిది, ప్రస్తుతం పెద్ద సందడి లేకుండా పోయింది. భవిష్యత్తులో అభివ్రుద్ధి చెందుతుందన్న భరోసా తగ్గడంతో పెట్టుబడులు పెట్టేవారూ వెనకడుగు వేస్తున్నారు. అంతెందుకు, ప్రవాసాంధ్రులు సైతం పెట్టుబడి కోణంలో విజయవాడని పరిగణనలోకి తీసుకోవడం లేదు. దీంతో, రాజధాని కంటే ముందు పరిస్థితులు ఎలా ఉండేవో ప్రస్తుతం ఇంచుమించు అదే విధంగా విజయవాడ రియల్ మార్కెట్ కొనసాగుతోంది. కొనుగోళ్ల సందడి గణనీయంగా తగ్గింది. ముందున్న ఊపూ, ఉత్సాహం పెద్దగా కనిపించడం లేదు. కాకపోతే, పెట్టుబడి కోణం బదులు స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలని భావించేవారు నేటికీ తమకు నచ్చిన ఫ్లాట్లను ఎంచుకుంటున్నారు. కాకపోతే, కొన్ని ప్రాజెక్టుల్ని క్షుణ్నంగా గమనించాక.. తక్కువ రేటుకు లభించే డెవలపర్ వద్ద మాత్రమే ఫ్లాట్లను ఎంచుకుంటున్నారు.

  • పలు ప్రాజెక్టుల వివరాలు..
  • పేరు ఎక్కడ సంఖ్య బెడ్రూమ్? ధర
  • వర్షా ఎలైట్ మంగళగిరి 90 2& 3 30- 45 లక్షలు
  • బండిస్ క్యాపిటల్ గేట్వే గొల్లపూడి 80 2 & 3 38.1- 60.8 లక్షలు
  • మెగా సరోవర్ గొల్లపూడి 48 2& 3 42.5- 81.5 లక్షలు
  • హేమదుర్గా జ్యుయల్ కౌంటీ నిడమానూరు – 2&3 40- 56 లక్షలు
  • విజయవాడలో నిన్నటివరకూ హాట్ లొకేషన్లుగా హల్ చల్ చేసిన పలు ప్రాంతాల్లో ఫ్లాట్ల ధరలెలా ప్రస్తుతం ఎలా ఉన్నాయో మీరే చూడండి. కేవలం మీకు అవగాహన కలిగించడానికి మాత్రమే ఈ రేట్లను అందజేస్తున్నాం.

ప్రాంతం రేటు (చ.అ.కీ.)

గన్నవరం- రూ.2,000
పెనమాలూరు రూ.2,800
గుణదల రూ.4,000
నిడమానూరు రూ. 4,200
కరెన్సీ నగర్ రూ.4,500
గొల్లపూడి రూ. 4,700
లబ్బీపేట్ రూ.4,800
బెంజ్ సర్కిల్ రూ.6,500
విద్యాధరపురం రూ.5,200
పోరంకి రూ. 4,000
కేసరపల్లె రూ. 2,600
తాడిగడప రూ. 4,500
ఆటోనగర్ రూ.4,000
గుంటుపల్లి రూ. 3,000

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here