VINAYA VIDEYA RAMA REVIEW

“VINAYA VIDEYA RAMA REVIEW” Mega Power start Ram Charan
మెగాప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్ అన‌గానే మ‌గ‌ధీర‌, ర‌చ్చ, ధృవ‌, రంగ‌స్థ‌లం .. వంటి సినిమాలే గుర్తుకు వ‌స్తాయి. ఈయ‌న న‌టించిన రంగ‌స్థ‌లం స‌రికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేసి ఇమేజ్‌ను డబుల్ చేసింది. మెగాభిమానులు త‌దుప‌రిగా చెర్రీ ఎవ‌రితో సినిమా చేస్తాడోన‌ని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న త‌రుణంలో బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో సినిమా అనౌన్స్ చేశారు. దీంతో అంద‌రిలో సినిమాపై అంచ‌నాలు పెరిగాయి. అందుకు కార‌ణం బోయ‌పాటి క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో సినిమా చేస్తూనే  హీరోను మాస్ కోణంలో అద్భుతంగా ఎలివేట్ చేసే ద‌ర్శ‌కుడు.. ఆయ‌న గ‌త చిత్రాలే అందుకు నిద‌ర్శ‌నం. మ‌రి బోయ‌పాటి మాస్ ఇమేజ్ ఉన్న రామ్‌చ‌ర‌ణ్‌ను ఎలా ప్రెజెంట్ చేస్తాడోన‌ని ఆస‌క్తి అంద‌రిలో క‌లిగింది. `విన‌య‌విధేయరామ‌` అనే సాఫ్ట్ టైటిల్ ట్రైల‌ర్ చూస్తే ఫ్యామిలీ, యాక్ష‌న్ ఎలిమెంట్స్ మెండుగా క‌న‌ప‌డ్డాయి. దీంతో బోయ‌పాటి రాంచ‌ర‌ణ్‌ను మాసీగానే చూపించే ప్ర‌య‌త్నం చేశాడ‌ని అర్థ‌మైంది. మ‌రి అది ఎంత మేర అని తెలుసుకోవాలంటే ముందు క‌థ‌లోకి వెళ‌దాం..
స‌మ‌ర్ప‌ణ‌:  డి.పార్వ‌తి
బ్యాన‌ర్‌: డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
న‌టీన‌టులు:  రామ్‌చ‌ర‌ణ్‌, కియ‌రా అద్వాని, వివేక్ ఒబెరాయ్‌, ప్ర‌శాంత్‌, స్నేహ‌, ఆర్య‌న్ రాజేష్‌, మ‌ధుమిత‌, ర‌వివ‌ర్మ‌, హిమ‌జ‌, హ‌రీష్ ఉత్త‌మ‌న్‌, మ‌హేష్ మంజ్రేక‌ర్‌, మ‌ధునంద‌న్‌, ఈషా గుప్తా(స్పెష‌ల్ సాంగ్‌) త‌దిత‌రులు
ఫైట్స్‌:  క‌న‌ల్ క‌ణ్ణ‌న్‌
మాట‌లు: ఎం.ర‌త్నం
ఎడిటింగ్‌:  కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర్ రావు, త‌మ్మిరాజు
ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్ర‌కాష్‌
కెమెరా:  రిషి పంజాబి, అర్థ‌ర్ ఎ.విల్స‌న్‌
సంగీతం:  దేవిశ్రీ ప్ర‌సాద్‌
నిర్మాత‌:  డి.వి.వి.దాన‌య్య‌
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  బోయ‌పాటి శ్రీను
క‌థ‌
న‌లుగురు అనాథ పిల్ల‌లు బ‌త‌క‌లేక క‌లిసి చ‌నిపోదామ‌నుకుంటారు. వారికి చెత్త‌లో ఓ ప‌సివాడు దొరుకుతాడు. అత‌న్ని కాపాడ‌టానికి ఆసుప‌త్రికి తీసుకెళ్తారు. అక్క‌డ డాక్ట‌ర్ వీళ్ల నిజాయ‌తీ చూసి ఉండ‌టానికి నీడ క‌ల్పిస్తాడు. కొన్నాళ్ల‌పాటు పెద్ద పిల్ల‌లు న‌లుగురు క‌లిసి చిన్న పిల్లాడిని చ‌దివిస్తారు. అయితే ఓ సంద‌ర్భంలో వ‌చ్చిన చిన్న గొడ‌వ వ‌ల్ల త‌ను త‌న అన్న‌లంద‌రినీ చ‌దివించాల‌ని నిర్ణ‌యించుకుంటాడు. అత‌నే రామ్ కొణిదెల (రామ్ చ‌ర‌ణ్‌). అత‌ని అన్న‌లు ప్ర‌శాంత్‌, ఆర్య‌న్ రాజేష్‌, ర‌వి వ‌ర్మ‌, మ‌ధునంద‌న్‌.  వారి భార్య‌లు స్నేహ‌, మ‌ధుమిత, హిమ‌జ‌. సామాజిక కార్య‌క‌ర్త‌గా హేమ క‌నిపిస్తుంది. ఆమె కుమార్తె హీరోయిన్ సీత (కియారా). పెద్ద‌న్న‌య్య భువ‌న్ కుమార్ (ప్ర‌శాంత్‌) ఎన్నిక‌ల అధికారిగా ప‌నిచేస్తుంటాడు. మిగిలిన వాళ్లు అత‌నికి సాయం చేస్తుంటారు. భువ‌న్ కుమార్ విధి నిర్వ‌హ‌ణ‌లో వ‌చ్చే స‌మ‌స్య‌ల‌ను రామ్ ఎలా డీల్ చేశాడు?  చివ‌రికి త‌న కుటుంబానికి వ‌చ్చిన స‌మ‌స్య ఏంటి?  దాన్నుంచి కుటుంబ సభ్యుల‌ను అత‌ను ఎలా కాపాడుకున్నాడ‌నేదే క‌థ‌.
ప్ల‌స్ పాయింట్లు
– రామ్‌చ‌ర‌ణ్ న‌ట‌న‌
– యాక్ష‌న్ సీక్వెన్స్
– సెట్స్
– రీరికార్డింగ్‌
– కెమెరా
మైన‌స్ పాయింట్లు
– ప్ర‌శాంత్ ఎమోష‌న్‌ని పండించ‌లేక‌పోయాడు
– ఆర్య‌న్ రాజేష్ పాత్రకు ప్రాధాన్యం లేదు
– రీరికార్డింగ్ పీక్స్ లో ఉంటే, ఆర్టిస్టుల ముఖాల్లో అది క‌నిపించ‌లేదు
– పాథ క‌థ‌
– క‌థ‌నంలో కొత్త‌ద‌నం లేదు
– లాజిక్కులు లేవు
– సినిమాలో లింకులు క‌నిపించ‌వు
విశ్లేష‌ణ‌
క‌థ‌లో బ‌లం లేకుండా నాలుగు ఫైట్ల‌ను డిజైన్ చేసుకుని వాటి చుట్టూ ఓ అంద‌మైన ఫ్యామిలీని, దాన్ని కాపాడాల‌నుకునే హీరోని గురించి ఆలోచించి రాసుకున్న క‌థ ఇది. రామ్‌చ‌ర‌ణ్ హీరోయిజాన్ని ఎలివేట్ చేసే సినిమా. మాస్ ప్రేక్ష‌కుల‌ను న‌చ్చాల‌నే ఏకైక కార‌ణంతో ఓ సీన్‌లో రామ్‌చ‌ర‌ణ్ ప్యాంట్ జిప్‌ను కూడా విప్పుతాడు. ఓ స్టార్ హీరో ఎంత చ‌దువుకోని వాడి పాత్ర చేసిన‌ప్ప‌టికీ, ఎమోష‌న్‌ని పండించ‌డానికి అలా చేసిన‌ప్ప‌టికీ ఎందుకో స‌రికాదేమోన‌నిపిస్తుంది. త‌ల‌లు న‌రికి ఎగ‌రేయ‌డం, వాటిని గ‌ద్ద‌లు ఎత్తుకుపోవ‌డం వంటివ‌న్నీ మాస్‌లో ప‌రాకాష్ట‌. హీరోయిన్ కేవ‌లం అంద‌చందాల‌ను ఒల‌క‌పోయ‌డానికి నాలుగు పాట‌ల్లో కుర‌చ దుస్తుల్లో క‌నువిందుచేసి త‌న ప‌నైపోయింద‌న్న‌ట్టు ప్ర‌వ‌ర్తిస్తుంది. ప్రియ‌ద‌ర్శిని రామ్ పాత్రను డిజైన్ చేసిన తీరు బావుంది. కానీ ఆ పాత్ర ప‌ర్ప‌స్ స‌ర్వైవ్ కాలేదు. స‌రిగా దాన్ని ఎండ్ చేయ‌లేదు. అలాంటి మ‌రో పాత్ర ముఖేష్ రుషి పాత్ర‌. అది కూడా ఎందుకు వ‌స్తుందో, ఎందుకు రాదో తెలియ‌దు. ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ పాత్ర ప‌వ‌ర్‌ఫులే. కానీ కేవ‌లం అత‌నే లా అండ్ ఆర్డ‌ర్‌ని చేతుల్లోకి తీసుకోవ‌డం సాధ్య‌మ‌య్యేప‌నేనా?  వీథుల వెంట స్వ‌యంగా ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ తిరిగి ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కాన్ని క‌ల్పించ‌డం గురించి క‌థ‌లోనైనా వింటామా?  రాష్ట్ర ప్ర‌భుత్వాలు అప్ప‌టిదాకా గ‌డ‌గ‌డ‌లాడిన ప్రైవేట్ ఆర్మీ వివేబ్ ఒబెరాయ్‌. అత‌ని పాత్ర అంత క్రూర‌త్వంగా అంత‌కు ముందు ఎలివేట్ కాదు. ఆ పాత్ర‌ను స్ట్రాంగ్ గా చూపించ‌డంలో ద‌ర్శ‌కుడు కాస్త విఫ‌ల‌మ‌య్యాడేమోన‌ని కూడా అనిపిస్తుంది. ఓ రాష్ట్రానికి ముఖ్య‌మంత్రి వ‌చ్చి మ‌రో రాష్ట్రంలో ఎక్క‌డో ఉన్న చ‌దువు కూడా రాని వ్య‌క్తి ముందు మిలిట‌రీ సైన్యంతో సెల్యూట్ చేయ‌డ‌మేంటో అర్థం కాదు. ఓ రాష్ట్రానికి ఎన్నిక‌ల అధికారి చ‌నిపోతే, క‌నుమ‌రుగైతే… అప్ప‌టిదాకా అత‌న్ని గురించి చెప్పిన టీవీలు, ప‌త్రిక‌లు ఎలా విస్మ‌రిస్తాయి?  సినిమాలో చూపించిన‌ట్టు బీహార్‌లాంటి రాష్ట్రంలో అట్టుడుకుతున్న ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించిన ఓ ఐఏయ‌స్ క‌నుమ‌రుగు కావ‌డం చిన్న విష‌య‌మేం కాదే? అవ‌న్నీ చ‌దువుకున్న కుటుంబ‌స‌భ్యుల‌కు ఎందుకు తెలియ‌దు? అత‌ని భార్య బీహార్ ముఖ్య‌మంత్రిని చూసి అమాయ‌కంగా `ఎవ‌రు` అని అడ‌గడం మ‌రీ హాస్యాస్ప‌దం. అన్న‌ట్టు సినిమాలో న‌వ్వులు తెప్పించే అంశాలు కూడా ఏమీ పెద్ద‌గా లేవు. హేమ పాత్ర కాస్త అతిగానే క‌నిపిస్తుంది. ఫ్యాన్స్ న‌చ్చి, మాస్ సినిమాల‌కు, క‌మ‌ర్షియ‌ల్ వేల్యూస్‌కు కాసుల వ‌ర్షం కురిస్తే చెప్ప‌లేం కానీ.. `విన‌య విధేయ రామ‌` గొప్ప సినిమా కాదు. మ‌రో క‌మ‌ర్షియ‌ల్ సినిమా అంతే. కాక‌పోతే రామ్‌చ‌ర‌ణ్‌లోని మాస్ కోణాన్ని సంపూర్ణంగా బ‌య‌ట‌పెట్ట‌గ‌లిగింది.
రేటింగ్: 2.25/5
బాట‌మ్ లైన్‌:  విన‌యం విధేయం కాదు.. విధ్వంస‌మే!
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article