ఇదిగో రైతుల సమస్యలు..

viral video

తోటి పిల్లలతో ఆడుకునే పిల్లాడు రైతుల కష్టాలను దగ్గరగా చూశాడు. నాలుగైదు రోజులుగా పడుతున్న వర్షాలకు పొలాలు నీటి మునగడంతో చలించిపోయాడు. రైతుల కష్టాలను కరిగిపోయి ఒక వీడియో తీసి ప్రభుత్వాన్ని ప్రశించాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది.

రైతులను ఎవ్వరూ పట్టించుకోరా? అని నిలదీశాడు. టీవీల్లో, సినిమాల్లో చూసినట్లుగా రైతు ఉండడని, ఇదిగో రైతుల కష్టాలు ఇలా ఉంటాయని వివరించి చెప్పాడు. ఈ కుర్రాడి తాత వేసిన వరి పొలం వానకు మునగడంతో  ఆ నీళ్లలోనే మెడదాకా కూర్చొని.. దండం పెడుతూ రైతుల బాధలను తెలియజేసే ప్రయత్నం చేశాడు. యాదాద్రి జిల్లా వలిగొండ మండలం అర్రూర్ గ్రామానికి చెందిన దొంతి అయిలయ్య మనువడు ఈ కుర్రాడు. అయిలయ్య ఆరు ఎకరాల్లో వరి పంట వేశాడు. ఇప్పటిదాకా రూ.15 లక్షలు ఖర్చు చేశాడు. పక్కనే అలుగు ఉండటంతో ఆ పొలమంతా నీట మునిగిపోయింది. తమకు నష్టపరిహరం చెల్లించాలని, న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ ను కోరాడు. స్పందించి కలెక్టర్ అనితా రామచంద్రన్ సమస్యపై విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article