ఏపీ రాజధానులపై మరోసారి స్పష్టత ఇచ్చిన జగన్

114
Visakha is a good destiny
Visakha is a good destiny

Visakha is a good destiny for the Development: CM Jagan

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అంశంపై ముఖ్యమంత్రి జగన్ కీలక  వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధానుల విషయంలో ప్రభుత్వ నిర్ణయం ఒకటేనని , మూడు రాజదానులకే కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఈ రోజు విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ…  విశాఖ పరిపాలనా రాజధాని అని పేర్కొన్నారు. విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్‌లోనే నం.1 నగరం. అన్ని విధాలా అభివృద్ధి చెందిన నగరంలో రాజధాని ఏర్పాటు తక్కువ ఖర్చుతో కూడుకున్న పని అని ఆయన పేర్కొన్నారు. ఇక ఉద్యోగాల కోసం మన పిల్లలు హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరుకు వెళ్లే అవసరం ఉండకూడదని అన్నారు.
ఇక అమరావతి శాసన రాజధానిగా ఉంటుందని అమరావతి విషయంలో కావాలనే రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసింది.  అమరావతి రాజధాని ప్రాంతంలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడానికి రూ.1.09,000 కోట్లు అవసరమని గత ప్రభుత్వ నివేదికలే చెప్పాయన్నారు . కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్దగా నిధులు వచ్చే అవకాశం లేదు. అమరావతిలో చేసే ఖర్చులో 10 శాతం విశాఖలో చేస్తే అద్భుతమైన రాజధాని తయారవుతుంది. అమరావతిలోనూ అభివృద్ధి కొనసాగుతుంది. ముఖ్యమంత్రిగా నేను రాబోయే తరం వారికి అన్ని సదుపాయాలు ఇక్కడే కల్పించాలి అని జగన్ అన్నారు.అభివృద్ధి ఒకే చోట కేంద్రీ కృతం కాకుందడన్నారు. అమరావతి శాసన రాజధానిగా ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు. అమరావతిలో కూడా అభివృద్ధి కొనసాగుతుందని చెప్పారు. విశాఖలో మౌళిక వసతులన్నీ ఉన్నాయని చెప్పారు. పదేళ్లలో విశాఖను అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉందన్నారు. ఏ నిర్ణయం తీసుకున్న రాష్ట్రాభివృద్ధి కోసమే అని సీఎం జగన్ చెప్పారు.

Visakha is a good destiny for the Development: #CMJagan,#capitalamaravati,three capitals,#gate way hotel 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here