విశాల్ బీజేపీలో చేరుతున్నారా..

51
Vishal join to bjp?
Vishal join to bjp?

Vishal join in bjp?

సినీ హీరో విశాల్ బిజేపీలో చేరుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాను బీజేపీ చేరుతున్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు. గతంలో విశాల్ సినీ నిర్మాతల సంఘం ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించాలని అనుకున్నారు. కానీ కుదరలేదు. ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న పార్టీలు సినీ నటీనటులను చేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విశాల్‌ బీజేపీలో చేరనున్నారని, ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మురుగన్‌ కలుసుకునేందుకు అపాయింట్‌మెంట్‌ అడిగారని ప్రసార మాధ్యమాల్లో వార్తలు హల్‌చల్‌ చేశాయి. విశాల్‌ ఓ తమిళ టీవీ చానెల్‌కు బీజేపీలో చేరే ప్రసక్తే లేదని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here