మహేష్ మెచ్చిన సినిమాలో విశ్వక్ సేన్  

viswak new movie

కొన్ని సినిమాల గురించి క్రిటిక్స్ చెప్పిన దానికంటే స్టార్స్ చెబితే కొత్తగా ఉంటుంది. ఓ పెద్ద స్టార్ హీరో ఒక సినిమా గురించి పాజిటివ్ గా మాట్లాడాడు అంటే ఇంక చెప్పేదేముందీ.. ప్రతి ఒక్కరూ ఆ మూవీ గురించి ఆరాలు తీస్తారు. అవసరమైతే రీమేక్ కు రెడీ అవుతారు. అలాంటి ఓ పాజిటివ్ కమెంట్ తో ఓ చిన్న తమిళ్ సినిమా పై అమాంతంగా క్రేజ్ పెంచాడు మన సూపర్ స్టార్ మహేష్ బాబు. సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఇన్నేళ్ల కెరీర్ లో ఎన్నో అఛీవ్ మెంట్స్ చూశాడు. అంతకు మించి మరెన్నో కథలు విని ఉంటాడు. అలాంటి పర్సన్ కు వేరే భాషలో చిన్న సినిమాగా వచ్చిన కథ నచ్చడం విశేషమే. ఆ కథలో ఏదో ప్రత్యేకత ఉంటే తప్ప.. ఓపెన్ గా ఆ సినిమా గురించి ట్వీట్ చేయరు కదా. మహేష్ బాబు చెప్పాడు. ఆ సినిమా తమిళ్ లో వచ్చిన ఓ మై కడవులే. అశోక్ సెల్వన్, గురు ఫేమ్ రితిక సింగ్, వాణి భోజన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఇది. విజయ్ సేతుపతి ఓ కేమియో రోల్ లో నటించాడు. ట్రైయాంగిల్ లవ్ స్టోరీలా అనిపించినా.. హీరో కోణం వేరేగా ఉండటం ఈ మూవీ పెద్ద ప్లస్ పాయింట్. ఒక హీరోయిన్ హీరోను ప్రేమిస్తుంది.

అతనేమో మరో అమ్మాయిని ప్రేమిస్తాడు. ఇటు ఫ్రెండ్షిప్ అనుకుని అటు ప్రేమగా భావించినా.. అతన్ని పర్సెప్షన్ ను వేరేగా అర్థం చేసుకున్న హీరోయిన్ల మధ్య నలిగిపోయే కుర్రాడి పాత్రలో అశోక్ నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీ లేటెస్ట్ గా ఓ టిటి ప్లాట్ ఫామ్ లో విడుదలై మంచి రివ్యూస్ సొంతం చేసుకుంది. మహేష్ కూడా ఓటిటిలోనే చూశాడు. నిజానికి ఈ మూవీ రీమేక్ రైట్స్ ను తెలుగులో ఆల్రెడీ పివిపి ప్రసాద్ తీసుకున్నాడు. విశ్వక్ సేన్ హీరోగా రూపొందించబోతున్నాడంటున్నారు. అదే టైమ్ లో ఈ మూవీలో హీరో అంటూ మరికొందరు కుర్రాళ్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా సూపర్ స్టార్ లాంటి హీరో మెచ్చుకున్న తర్వాత ఈ మూవీకి తెలుగులోనూ మంచి క్రేజ్ వస్తుందని చెప్పొచ్చు. అలాగే ప్రమోషన్స్ లో కూడా తర్వాత మహేష్ ట్వీట్ ను వాడేస్తారు. మరి తెలుగులో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.

tollywood news

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article