మళయాల సినిమా రీమేక్ లో విశ్వక్ సేన్

21
viswak new movie
viswak new movie

viswaksen in mollywood remake

ఈ మధ్య తెలుగులో మళయాల సినిమాల సందడి పెరుగుతోంది. మామూలుగా నైన్టీస్ లో అక్కడి సినిమాలు తెలుగులో బాగా డబ్ అయ్యేవి. తర్వాత వారి ఊసు లేదు. అయితే కొన్నాళ్లుగా మాలీవుడ్ మూవీస్ ను మనవాళ్లు బాగా చూస్తున్నారు. కొన్ని సినిమాలకు అడిక్ట్ అవుతున్నారు కూడా. ఈ మధ్య డబ్ అయిన వాటిలో మన్యం పులి, లూసీఫర్, కనులు కనులను దోచాయంటే సినిమాలు తెలుగులో కమర్షియల్ గా మంచి విజయాలు కూడా అందుకున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి సినిమాలను తెలుగులో రీమేక్ చేసేందుకు మన నిర్మాతలు బాగా ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి కోసం రామ్ చరణ్ లూసీఫర్ రీమేక్ రైట్స్ తీసుకున్నాడు. సాహో ఫేమ్ సుజీత్ ఈ రీమేక్ ను హ్యాండిల్ చేయబోతున్నాడు.
ఇక సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఆల్రెడీ అయ్యప్పనుమ్ కోషియం రైట్స్ తీసుకుంది. రవితేజ, రానా ఇందులో నటించబోతున్నారు. ఇదే బ్యానర్ లేటెస్ట్ గా కప్పెలా అనే మూవీ రైట్స్ తీసుకుంది. ఓ చిన్న పాయింట్ చుట్టూ అల్లుకున్న స్మాల్ టౌన్ బ్యాక్ డ్రాప్ మూవీ ఇది.

ఈ మధ్య దర్శకుడు తరుణ్ భాస్కర్ ఓ మళయాల సినిమా గురించి చెబుతూ తెలుగు సినిమాలను తక్కువ చేశాడని చెబుతూ కొందరు అభిమానులు అతన్ని ట్రోల్ చేశారు కదా.. అతను చెప్పిన సినిమానే ఈ కప్పెలా. ఈ రైట్స్ ను సితార బ్యానర్ కేవలం 25 – 30 లక్షల మధ్యే తీసుకుందని సమాచారం. ఇక తరుణ్ చెప్పాడనో లేక తనే చూశాడో కానీ ఈ మూవీలో తనే హీరోగా నటిస్తానని విశ్వక్ ముందు నుంచీ సితార వారిని అడుగుతున్నారట. ఆ బ్యానర్ నుంచి ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. కానీ దాదాపు విశ్వక్ నే ప్రధాన పాత్రకు తీసుకుంటారనుకోవచ్చు. అయితే దర్శకుడు, ఇతర ఆర్టిస్టుల ఎంపిక పూర్తయిన తర్వాత ప్రధాన పాత్రధారుల్లో కొన్ని మార్పులు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు అనేది ప్రొడక్షన్ హౌస్ నుంచి వినిపిస్తోన్న వెర్షన్. అదీ మేటర్. మొత్తానికి విశ్వక్ సేన్ కు కూడా ఈ సినిమా బాగా నచ్చిందన్నమాట. అన్నట్టు అతను కూడా మళయాల మూవీ అంగామలై డైరీస్ నే తెలుగులో స్వీయ నిర్మాణంలో ‘ఫలక్ నుమా దాస్’గా రీమేక్ చేసి హిట్ కొట్టాడు కదా. అందుకే ఆ సినిమాలపై అంత గురి అన్నమాట.

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here