మార్చి 21న ‘విశ్వామిత్ర’

Viswamitra’ to release on March 21

సృష్టిలో ఏది జరుగుతుందో… ఏది జరగదో!? చెప్పడానికి మనుషులు ఎవరు? ఈ సృష్టిలో ఏదైనా సాధ్యమే. సృష్టి ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. అందులో మనుషులు కొంతకాలం మాత్రమే జీవిస్తారని చెప్పే ప్రయత్నమే మా ‘విశ్వామిత్ర’ చిత్రకథ అని దర్శకుడు రాజకిరణ్ అన్నారు. సృష్టికి, మనిషి ఊహకు ముడిపెడుతూ తీసిన ‘విశ్వామిత్ర’ చిత్రాన్ని మార్చి 21న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ఆయన అన్నారు.

ఫణి తిరుమలశెట్టి సమర్పణలో రాజకిరణ్ సినిమా పతాకంపై మాధవి అద్దంకి, రాజకిరణ్ ఎస్., రాజకిరణ్ నిర్మిస్తున్న సినిమా ‘విశ్వామిత్ర’. నందితారాజ్, ‘సత్యం’ రాజేష్, అశుతోష్ రాణా, ప్రసన్నకుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ‘గీతాంజలి’, ‘త్రిపుర’ వంటి థ్రిల్లర్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన రాజకిరణ్ దర్శకత్వం వహించారు. మార్చి 21న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, ఈ నెల 21న ట్రైలర్ విడుదల విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు.

ఈ సందర్భంగా దర్శకుడు రాజకిరణ్ మాట్లాడుతూ “వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన థ్రిల్లర్  చిత్రమిది. న్యూజీలాండ్‌, అమెరికాలో నిజంగా జరిగిన కథలపై పరిశోధన చేసిన ఈ కథ రాసుకున్నా. నందితారాజ్ మధ్యతరగతి అమ్మాయి పాత్రలో కనిపిస్తారు” అన్నారు.

ఈ చిత్రంలో అశుతోష్ రాణా, ప్రసన్నకుమార్, విద్యుల్లేఖ రామన్, చమ్మక్ చంద్ర, గెటప్ శ్రీను, పరుచూరి వెంకటేశ్వరరావు, జీవా, రాకెట్ రాఘవ, సి.వి.ఎల్ నరసింహారావు, ఇందు ఆనంద్ ముఖ్య తారాగణం.

సాంకేతిక నిపుణులు:
ఈ చిత్రానికి మాటలు: వంశీకృష్ణ ఆకెళ్ళ, ఫోటోగ్రఫీ: అనిల్ బండారి, ఎడిటర్: ఉపేంద్ర, మ్యూజిక్: అనూప్ రూబెన్స్, యాక్షన్: డ్రాగన్ ప్రకాష్, కొరియోగ్రఫీ: సుచిత్ర – భాను, ఆర్ట్: చిన్నా, కో-డైరెక్టర్: విజయ్ చుక్కా, పి.ఆర్.ఓ: నాయుడు – ఫణి, నిర్మాతలు: మాధవి అద్దంకి, రజనీకాంత్, రాజకిరణ్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: రాజకిరణ్

Viswamitra’ to release on March 21

Is it in the power of humans to say what possibly can and cannot happen in this creation?  Anything is possible in this eternal creation.  ‘Viswamitra’ drives home the message that men live only for some time in this timeless universe.  
 
A thriller directed by Raajkiran, the film stars Nanditha Raj, Sathyam Rajesh, Prasanna Kumar and Ashutosh Rana in main roles.  It will hit the screens on March 21.
 
Presented by Phani Tirumalashetty, the film is produced by Madhavi Addanki, S Rajinikanth and Raajkiran.  The director, who previously made ‘Githanjali’ and ‘Tripura’, reveals that the Trailer will be released on February 21.
 
Talking about his product, director Raajkiran says, “The incidents shown in the film happened for real in New Zealand and the US.   Although it’s not pure horror, there are doses of horror.  Nanditha will be seen as a middle-class girl.”
 
Also featuring are Vidyullekha Raman, Chammak Chandra, Get-up Srinu, Paruchuri Venkateswara Rao, Jeeva, Rocket Raghava, CVL Narasimha Rao, Indu Anand.
 
Music is by Anup Rubens.  Cinematography is by Anil Bandari.  Editing is by Upendra.  Action choreography is by Dragon Prakash.  Choreography is by Suchitra-Banu.  Art direction is by Chinna.  Dialogues are by Vamsikrishna Akella.  Co-Direction is by Vijay Chukka.  Story and screenplay are by director Raajkiran. 
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article