బీజేపీలో వివేక్ చేరికకు ఆషాడం అడ్డొచ్చిందంటా !

VIVEK JOINING IN BJP AFTER ASHADAM

మాజీ ఎంపీ వివేక్ బీజేపీలో చేరుతున్నారన్న వార్త జోరుగా ప్రచారం అయ్యింది. ఈ రోజు బీజేపీ తీర్ధం పుచ్చుకునే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. కానీ ఆయన పార్టీలో చేరికకు ఆషాడం అడ్డు వచ్చిందట . భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను పెద్దపల్లి మాజీ పార్లమెంటు సభ్యుడు జి. వివేక్ మంగళవారం ఢిల్లీలో కలిశారు. ఈ నేపధ్యంలో ఆయన ఈ రోజు బీజేపీ తీర్ధం తీసుకుంటారనే వార్తలు వచ్చాయి. కానీ ఆయన ఈ రోజు పార్టీలో చేరలేదు . ఇక అమిత్ షా తో భేటీ అయిన వివేక్ ఆయనతో చర్చించారు . ఇక ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సచివాలయం కూల్చివేత నిర్ణయంపై అమిత్‌షాకు వివేక్ ఫిర్యాదు చేశారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం ప్రజాధనాన్ని వృధా చేస్తోందంటూ వివేక్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా వివేక్ ఈ రోజు పార్టీ లో చేరకపోవటానికి కారణం మంచి రోజులు కాదట. ఆషాడ మాసం కావటంతో ఆయన వచ్చే నెలలో శ్రావణ మాసం కాబట్టి అప్పుడు బీజేపీలో చేరతారని తెలుస్తుంది . దీనిలో భాగంగానే ఆయన అమిత్ షాను కలిశారని రాం మాధవ్ తో కలిసి అమిత్ షా తో పార్టీలో చేరికపై చర్చించారని తెలుస్తుంది.

POLITICAL NEWS

PANCHANGAM ON AMAZON

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article