భారీ కెమెరాలతో వివో నుంచి రెండు ఫోన్లు

VIVO V15 PRO

  • 48 ఎంపీ రియర్, 32 ఎంపీ సెల్ఫీ కెమెరాల ఏర్పాటు
  • 20న భారత్ లో విడుదల

సెల్ఫీ ప్రేమికుల కోసం వివో అద్భుతమైన స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చింది. భారీ ఫ్రంట్ కెమెరాతో కూడిన రెండు కొత్త ఫోన్లను భారత్ మార్కెట్లో ప్రవేశపెడుతోంది. వివో వీ15, వివో వీ15 ప్రో పేరుతో రెండు ఫోన్లను ఈ నెల 20న ఇండియాలో లాంచ్‌ చేస్తోంది. ఈ రెండు ఫోన్లలోనూ ఏకంగా 32 మెగా పిక్సెల్ సామర్థ్యం కలిగిన పాపప్ సెల్ఫీ కెమెరా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇక వెనుకవైపు 48 మెగాపిక్సెల్ సామర్థ్యంతో కూడా ప్రైమరీ కెమెరాతోపాటు 8 ఎంపీ, 5 ఎంపీలతో మొత్తం ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండనుంది. దీంతో ఆ ఫోన్ పై మొబైల్ లవర్లలో ఆసక్తి నెలకొంది. ధర దాదాపు రూ.30 వేల వరకు ఉండొచ్చని అంచనా. ఇప్పటికే దీనికి సంబంధించి బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమీర్‌ ఖాన్‌ టీజర్‌ వీడియో ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతోంది.

మార్కెట్ వర్గాల అంచనాల ప్పకారం వివో వీ15 ప్రో ఫీచర్లివీ…
6.4 అంగుళాల డిస్‌ప్లే
స్నాప్‌డ్రాగన్ 675 ప్రాసెసర్
6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్
48+8+5 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా
32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
3700 ఎంఏహెచ్ బ్యాటరీ

MOBILE MARKET

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article