వీకే సింగ్ సంచలన వ్యాఖ్యలు

82
VK SING SENSATIONAL COMMENTS
VK SING SENSATIONAL COMMENTS

VK SING SENSATIONAL COMMENTS

పోలీసు వ్యవస్థపై జైళ్ల శాఖ మాజీ డీజీ వీకే సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు పోలీసు వ్యవస్థ వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. రాజకీయాలతో బంగారు తెలంగాణ రాదని పేర్కొన్నారు. జైళ్ల శాఖ డీజీగా పనిచేసిన సింగ్.. ఆ శాఖలో పలు సంస్కరణలు తీసుకొచ్చారు. ఇవి పలువురి మన్ననలు అందుకున్నప్పటికీ, కొన్ని విషయాల్లో ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఆయన స్వతంత్రంగా వ్యవహరించడం ఉన్నత స్థాయిలో పెద్దలకు నచ్చలేదు. దీంతో ఆయన సెలవుపై ఉన్నప్పుడు ఏ మాత్రం ప్రాధాన్యం లేని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా బదిలీ చేశారు. ఈ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసిన ఆయన.. తాజాగా ఒక్కసారిగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేకుండా ప్రజల కోసం పని చేస్తానని పేర్కొన్నారు. పదవుల కోసం తాను పోలీస్ డిపార్ట్ మెంట్ కు రాలేదని, ప్రజలకు సేవ చేయడం కోసమే వచ్చానని స్పష్టంచేశారు. ప్రస్తుత పోలీసు వ్యవస్థలో మార్పులు అవసరమని ఉద్ఘాటించారు. ప్రింటింగ్, స్టేషనరీ, స్టోర్స్ కమిషనర్ గా కొనసాగుతూ సాంఘిక సంక్షేమం కోసం పని చేస్తానని వెల్లడించారు. జైళ్ల డీజీగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఆనంద ఆశ్రమంతో దాదాపు 15వేల మంది యాచకులకు ఆశ్రయం కల్పించామని, అది తనకు చాలా ఆనందం కలిగించిన విషయమని చెప్పారు. మొత్తమ్మీద ముక్కు సూటిగా వ్యవహరించే వీకే సింగ్.. తాను చెప్పాలనుకున్న విషయాలన్నింటినీ చెప్పేశారు. మరి ఈ అంశాలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

POLICE NOTICE TI BIG BOSS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here