VOTE FOR MONEY CASE
ఓటుకు నోటు వ్యవహారం మరోమారు తెరమీదకు వచ్చింది. ఈ కేసులో వేం నరేందర్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన అధికారులు వేం నరేందర్ రెడ్డి ని విచారించారు. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడైన రేవంత్ రెడ్డి పై కూడా త్వరలో ఈడీ కొరడా ఝులిపించనుండి అని తెలుస్తోంది. అందులో భాగంగానే వేం నరేందర్ రెడ్డిని విచారించిన ఈడీ అధికారులు ఆయన నుండి తమకు కావాల్సిన సమాధానం రాబట్టేందుకు చాలా ప్రయత్నం చేశారు.
ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్ నేత వేం నరేందర్ రెడ్డిని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ రాజ్ శేఖర్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. స్టీఫెన్ సన్ కు ఇవ్వజూపిన 50 లక్షల రూపాయల లెక్కల పై ఈడీ అధికారులు నరేందర్ రెడ్డిని ప్రశ్నస్తున్నారు. మిగిలిన నాలుగున్నర కోట్లు ఎక్కడ అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. వేంనరేందర్ రెడ్డి ఆస్తులపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. ఐ.టి,ఏ.సి.బి శాఖ ఇచ్చిన సమాచారం తో , బ్యాంక్ అకౌంట్స్ ముందు ఉంచి నరేందర్ ను అధికారులుప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసు లో రేవంత్ రెడ్డి,ఉదయ సింహను ఈడీ విచారించింది. మంగళవారం కుమారుడు తో కలసి నరేందర్ రెడ్డి ఈడీ కార్యాలయంకు వచ్చారు.ఇప్పటివరకు వివిధ శాఖల నుండి ఈ డి సేకరించిన సమాచారం, వెం నరేందర్ రెడ్డి ఇస్తున్న సమాచారాన్ని బట్టి ఈడీ భవిష్యత్తు నిర్ణయాన్ని తీసుకోనుంది .
For More Click Here