Saturday, March 15, 2025

వ్య‌తిరేక‌మా.. అనుకూల‌మా..? ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పోటీపై సీఎం సైలెంట్‌వ్య‌తిరేక‌మా.. అనుకూల‌మా..? ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పోటీపై సీఎం సైలెంట్‌

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల హాడవుడి కాంగ్రెస్‌లో మొదలైంది. ఆశావాహుల సంఖ్య కూడ రోజురోజుకి పెరుగుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన‌ మనసులోని మాట బయటకి చెప్పారు. అధిష్టానం అదేశిస్తే పొటికి సై అంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీ ఎన్నికలపైనా ఫోకస్ పెట్టిన నేపధ్యంలో అభ్యర్థుల ఎంపికపై వాడివేడి చర్చ జరుగుతుంది. ఇలాంటి స‌మ‌యంలో జీవ‌న్ రెడ్డికి మ‌ద్ద‌తుగా సీఎం రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణ‌యంపై అంతా ఆస‌క్తి నెల‌కొన్న‌ది. ఇప్ప‌టికే జీవ‌న్ రెడ్డి తిరుగుబాటు ప్ర‌క‌టించారు. త‌న అనుచ‌రుడి హ‌త్య సంద‌ర్భంగా ఆయ‌న అధిష్టానంపై మండిప‌డ్డారు.
ఉత్తర తెలంగాణలో కీలకమైన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు మార్చి మొదటివారంలో జరిగే అవకాశం ఉంది. పార్లమెంటు ఎన్నికల తరువాత ఇది ముఖ్యమైన ఎన్నికగా మారింది. ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం ఉమ్మడి అదిలాబాదు, ‌కరీంనగర్, నిజామాబాదు, మెదక్ జిల్లాల్లో విస్తరించి ఉంది. 2019 ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి పొటీ చేసి విజయం సాధించారు. అ సమయంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ కారు టైరు పంచర్ చేయగలిగింది. బీఅర్ఎస్ ని ఎదుర్కొని కాంగ్రెస్ విజయం సాధించిన జీవన్‌రెడ్డి ఉత్తర తెలంగాణ జిల్లాలలో కాంగ్రెస్ క్యాడర్ లో నూతన ఉత్సహాం నింపారు. 2023 అసెంబ్లీ ఎన్నికలో జగిత్యాల నుండి జీవన్ రెడ్డి పొటీ చేసి ఓడిపోయారు. తరువాత అయన ప్రత్యర్థి ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు కాంగ్రెస్ కండువా కప్పడంతో జీవన్ రెడ్డి తన అసంతృప్తి ని బహిరంగంగానే వెళ్లగక్కారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి సిద్దమైన జీవన్‌రెడ్డిని రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు, హైకమాండ్ నేతలు బుజ్జగించాల్సి వచ్చింది.

తిరుగుబావుటా
ఇటివల తన ప్రధాన అనుచరుడు గంగారెడ్డి హత్య నేపధ్యంలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మరోసారి అధిష్టానం పై విమర్శలు గుప్పించారు..తరువాత ముఖ్యనేతలు‌ మాట్లాడిన కూడా వెనక్కి తగ్గలేదు. ఈ పరిణామాల కారణంగా జీవన్ రెడ్డి మరోసారి ఎమ్మెల్సీ గా పొటి చేయరని అందరూ భావించారు. కాని మరోసారి ఎమ్మెల్సీ బరిలో దిగేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వారం రోజుల నుండి కాంగ్రెస్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎమ్మెల్సీ అభ్యర్థులపై కూడా గాంధీబవన్ లో సమావేశం నిర్వహించారు.. అయితే ‌సిట్టింగ్ ఎమ్మెల్సీ ‌జీవన్ రెడ్డి జగిత్యాల లలో మీడియా తో‌ మాట్లాడారు. మరోసారి అవకాశం ‌ఇస్తే పోటీ చేస్తానని ప్రకటించారు. అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అంటూ చెప్పుకొచ్చారు.. అయితే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ ‌కండువా కప్పుకున్నప్పటి నుంచి జీవన్‌రెడ్డి అధిష్టానం పై విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా ఫిరాయింపుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి విమర్శలు గుప్పిస్తున్నారు.కాంగ్రెస్ నేత, తన ప్రధాన అనుచరుడు గంగారెడ్డి హత్య తర్వాత నేరుగా ప్రభుత్వం పై తిరుగుబావుటా ఎగుర‌వేశారు. ఇలాంటి పరిస్థితులలో జీవన్ రెడ్డికి మరోసారి టికెట్ కేటాయిస్తారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి . అయితే ఆయన మాత్రం తన అనుచరులకి‌ పోటీకి సిద్దమని చెప్తున్నారు . మరి జీవన్ రెడ్డి టికెట్ విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com