ములుగు జిల్లాలో ఎస్సై సూసైడ్ చేసుకున్నారు. సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని వాజేడు ఎస్సై హరీష్.. ముళ్లకట్ట సమీపంలోని హరిత రిసార్ట్స్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున జరిగింది.
ప్రేమించిన యువతితో వివాహం జరుగడం లేదనే మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు.
ఆదివారం బందోబస్తు తరువాత.. వాజేడు ఎస్సై రాత్రి సమయంలో యువతితో కలిసి హరిత రిసార్ట్‌కు వెళ్లారు. అయితే ఎస్సై ఆత్మహత్య చేసుకున్న సమయంలో యువతి అదే గదిలో ఉంది. వెంటనే ఆ యువతి పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న ఎస్సై స్వగ్రామం జయంశంకర్ భుపాలపల్లి జిల్లా రేగొండ మండలం వెంకటేశ్వర్ల గ్రామం. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.