ఓట్లు అమ్ముకునేకంటే అడుక్కుంటే ఎక్కువ డబ్బు వస్తుంది

If you want to sell more money, you get more money

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇప్పుడు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న తనను ఓడించడానికి 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్ ఇక తాజాగా మరో సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో ఓటు నమ్ముకున్న కంటే వీధుల్లో బిక్షాటన చేస్తే ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఆయన దీనికి ఒక లెక్క కూడా చెప్పారు.

మంగళగిరి లోని పార్టీ కార్యాలయంలో జనసేన కార్యకర్తలు కలుసుకున్న పవన్ కళ్యాణ్ తాజా ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల వైఫల్యం గురించి, జనసేన పార్టీ ఓటమి గురించి విస్తృతంగా చర్చించారు ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటును అమ్ముకునే వారికంటే వీధుల్లో అడుక్కుతినే వారు ఎక్కువ సంపాదిస్తారు అంటూ వ్యాఖ్యానించారు. పార్టీ కార్యకర్తల తోనూ, ఓటర్లను మాట్లాడిన పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీలు ఒక ఓటు కోసం ఎంత డబ్బు ఇచ్చారంటూ ప్రశ్నించారు. దీంతో వారు ఓటుకు రెండు వేల రూపాయల చొప్పున ఇచ్చారంటూ సమాధానమిచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ రాబోయే ఐదు సంవత్సరాలలో అన్ని రోజులకు కలిపి రెండు వేల రూపాయలను విభజిస్తే వారికి రోజుకు ఒక రూపాయి పడుతుందని లెక్క చెప్పారు. ఎందుకంటే రెండు వేల రూపాయలు తీసుకొని ఓటేసి గెలిపించిన నాయకులు ఐదు సంవత్సరాల పాటు పాలన సాగిస్తున్నారు కాబట్టి పవన్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారు.

రెండు వేల రూపాయలకు ఓటును విక్రయించిన ప్రజల కంటే వీధుల్లో బిక్షాటన చేసిన వారు చాలా ఎక్కువ సంపాదిస్తారు అంటూ ఆయన కార్యకర్తలతో అన్నారు. ఇక తాను రాజకీయాలను విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. తన తుది శ్వాస వరకు తన భుజస్కంధాలపై పార్టీ బాధ్యతలు తీసుకుంటానని ఆయన పేర్కొన్నారు. అందరూ పార్టీని వదిలి వెళ్ళిన ఒంటరిగానైనా తన పోరాటాన్ని సాగిస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయినా తన పోరాట మాత్రం ఆగదని స్పష్టం చేశారు. ఇక నుండి రాజకీయ వ్యూహాలపై కూడా పవన్ దృష్టి కేంద్రీకరించినట్లు గా పేర్కొన్నారు. పవన్ చేసిన వ్యాఖ్యలు ఇబ్బంది కరంగా అనిపించినా డబ్బులకు ప్రలోభపడి ఓట్లు అమ్ముకోవడం పై పవన్ చెప్పిన లెక్క మాత్రం అందరూ ఆలోచించేలా చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *