నిందితుణ్ణి కటినంగా శిక్షించాలి

Warangal Rapist Should Punished

18.06.2019 రాత్రి 9నెలల చిన్నారిఆత్యాచారం మరియు హత్య కేసు దృష్టికి వచ్చిన వెంటనే, ఈ కేసు దర్యాప్తు వేగవంతం చేయాలని, నిందితుణ్ణి చట్ట ప్రకారం కఠీనంగా శిక్షించడానికి తగు చర్యలు తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమీషనర్ ను హోం మంత్రి శ్రీ మహమ్మద్ మహమూద్ అలీ ఆదేశించారు.ఈ ఘోరానికి పాల్పడిన  శాయంపేట మండలం వసంతపూర్‌ గ్రామానికి చెందిన నిందితుడు పోలేపాక ప్రవీణ్‌ను మరుసటి రోజే అనగా 19.06.2019 న హన్మకోండ పొలీసులు అరెస్టు చేశారు. నిందితుడు గత కోద్ది కాలంగా హన్మకోండ ప్రాంతంలో ఓ హోటల్లో క్లీనర్‌గా పనిచేసే  వాడు. నిందితుడు 18-06-19 తేది ఆర్థరాత్రి సమయంలో  హన్మకోండ కుమార్‌ పల్లిలో  తల్లి తో మేడపై నిద్రిస్తున్న తొమ్మిది నెలల చిన్నారి ఎత్తుకెళ్ళి అదే ప్రాంతంలో నిర్మానుష్య ప్రాంతంలో ఆత్యాచారం చేసి అనంతరం హత్యకు పాల్పడిన విషయం పోలిసుల ప్రాధమిక దర్యాప్తులో తేలింది.

ప్రాధమిక దర్యాప్తు ప్రకారం, అర్థరాత్రి 2.30 సమయంలో మేడపై తన ప్రక్కనే నిద్రిస్తున్న తన కుమార్తే కనిపించక పోవడంతో,  మృతురాలి మామయ్య చుట్టు ప్రక్కలవారితో కల్సి చిన్నారి కోసం గాలిస్తూ, నిందితుడు చిన్నారిని టవల్‌లో చుట్టి భుజాన వేసుకోని వెళ్ళడం గమనించి,  నిందితుడిని పట్టుకోని డయల్‌ 100కు ఫోన్‌ చేయడంతో సంఘటన స్థలానికి చేరుకుని  పోలీసులు, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు….హస్పటల్‌ కు తీసుకపోగా  చిన్నారి పరీక్షించిన డాక్టర్లు మరణించిసట్లుగా నిర్థారించారు.ఈ సంఘటన సంబంధించి మరణించిన చిన్నారి మామయ్య హన్మకోండ పోలీస్‌ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు అధారంగా నిందితుడు ప్రవీణ్‌ను అరెస్టు చేసి సెక్షన్‌ 366,302,376ఎ, 376ఎబి, 379 ఐ.పి.సి సెక్షన్లతో పోక్సో యాక్ట్‌ 2012 సెక్షన్ల  క్రింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం.నిందితుడిని కఠీనంగా శిక్షించడానికి, చట్ట ప్రకారం అన్ని చర్యలు తీసుకోవాలని, ఈ కేసులో వేగవంతంగా శిక్ష పడేటట్టు చేయడానికి, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా ట్రయల్ చేసే విషయంపై ప్రతిపాదనలు చేయాలని వరంగల్ పోలీస్ కమీషనర్ ను హోం మంత్రి శ్రీ మహమ్మద్ మహమూద్ అలీ ఆదేశించారు.

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article