పాకిస్థానీలు 48 గంటల్లో వెళ్ళిపోవాలని ఆ కలెక్టర్ ఆదేశం

Warning for Pakistan ,they have leave India with in 48 hours

పుల్వామా ఉగ్ర దాడి నేపథ్యంలో దేశమంతా ఏకతాటి మీదకు వచ్చింది
. పుల్వామాలో ఉగ్రదాడి దేశంలో తీవ్ర భావోద్వేగాలను రేపింది. భారత్ – పాకిస్తాన్ దేశాల మధ్య అంతంత మాత్రంగా ఉన్న సంబంధాలు ఈ దాడి తర్వాత పూర్తిగా దెబ్బతిన్నాయి. పాక్ ఉత్పత్తులపై సుంకాలను 200 శాతం పెంచేసింది. ఇదే క్రమంలో రాజస్థాన్ రాష్ట్రం బికనీర్ జిల్లా కలెక్టర్ కుమార్ పాల్ గౌతమ్ కీలక ఆదేశాలు జారీచేశారు. బికనీర్ లో పనిచేస్తున్న పాకిస్థానీలు వెంటనే జిల్లా విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు కలెక్టర్. నగరం విడిచి పెట్టి 48 గంటల్లోగా వెళ్లిపోవాలని ఆదేశించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను కూడా జారీ చేశారు.
ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని.. జిల్లాలోని హోటళ్లు, లాడ్జిల్లో పాకిస్థానీలను అనుమతించరాదని స్పష్టం చేశారు. ఈ ఆదేశాలు రెండు నెలలు అమల్లో ఉంటాయని ఉత్వర్లుల్లో స్పష్టం చేశారు. పాక్‌ కళాకారులు భారతీయ చిత్ర పరిశ్రమలో పనిచేయడాన్ని నిషేధిస్తున్నట్లు ఆల్‌ ఇండియా సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌ ఇప్పటికే ప్రకటించింది. పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై ఉగ్రసంస్థ జైషే మొహమ్మద్ చేసిన ఆత్మాహుతి దాడిలో 40 మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కలెక్టర్ ఈ ఆదేశాలను జారీ చేశారు.

Check out here For More News

For More Interesting and offers

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article