వాట్సాప్ వినియోగదారులూ.. జర జాగ్రత్త

Watts app users Be careful warning

  • వాట్సాప్ గోల్డ్, వాట్సాప్ ప్లస్ స్పామ్ మళ్లీ వస్తోంది
  • డౌన్ లోడ్ చేశారో.. మీ ఫోన్ హ్యాక్ అయినట్టే

మీకు వాట్సాప్ గోల్డ్ లేద వాట్సాప్ ప్లస్ గుర్తుందా? మీ వాట్సాప్ లో మరిన్ని ఫీచర్లు పొందాలనుకుంటే వెంటనే డౌన్ లోడ్ చేసుకోండంటూ 2016లో వచ్చిన ఈ నకిలీ వాట్సాప్ యాప్.. లక్షలాది మంది యూజర్ల వ్యక్తిగత డేటాను సంగ్రహించింది. తాజాగా ఈ నకిలీ వాట్సాప్ స్పామ్ మళ్లీ వచ్చింది. వాట్సాప్ లో అంతర్లీనంగా ఉన్న మరిన్ని ఫీచర్లు పొందాలంటే వెంటనే వాట్సాప్ గోల్డ్ లేదా వాట్సాప్ ప్లస్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలంటూ మీకు ఏదైనా మెసేజ్ వస్తే.. తొందరపడి స్పందించకండి. ఒకవేళ ఆ మెసేజ్ కు స్పందించి.. ఆ యాప్ డౌన్ లోడ్ చేశారో అంతే సంగతి. మీ ఫోన్, అందులోని డేటా మొత్తం సైబర్ నేరగాళ్లకు చేరిపోతుంది. అందువల్ల వాట్సాప్ కు సంబంధించి వచ్చే ఇలాంటి మెసేజ్ లను నమొద్దని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. వాట్సాప్ అప్ డేట్స్ ఏమైనా ఉంటే యాప్ ద్వారా ఆటోమేటిగ్గా జరుగుతాయని, ఇలా ఇతర యాప్ లు డౌన్ లోడ్ చేసుకోమని కంపెనీ చెప్పదని పేర్కొంటున్నారు. 2016లో ఇలాగే వాట్సాప్ గోల్డ్ లేదా వాట్సాప్ ప్లస్ స్పామ్ వచ్చి, పలువురు వినియోగదారుల వ్యక్తిగత సమాచారం సంగ్రహించడంతో కంపెనీ దీనిపై వివరణ కూడా ఇచ్చింది. వాట్సాప్ కు వాట్సాప్ గోల్డ్ లేదా వాట్సాప్ ప్లస్ తో ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేసింది. తాజాగా సైబర్ నేరగాళ్లు మళ్లీ అలాంటి వ్యూహంతోనే రానున్నారంటూ ప్రస్తుతం వాట్సాప్ లో సందేశం చక్కర్లు కొడుతోంది. మాత్రినెల్లీ పేరుతో ఓ వీడియో వస్తుందని, దానిని క్లిక్ చేయొద్దని, ఒకవేళ దానిని డౌన్ లోడ్ చేస్తే.. మీ డివైజ్ ను హాక్ చేయడానికి అవసరమైన మాల్ వేర్ మీ ఫోన్ లో డౌన్ లోడ్ అయిపోతుందని ఆ మెసేజ్ లో ఉంది. సో.. వాట్సాప్ వినియోగదారులూ.. జర జాగ్రత్త.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article