Was She ready to act with Balakrishna
నందమూరి బాలకృష్ణకు సినిమాలు చేయడం కష్టం కావడం లేదు కానీ.. ఆయనకు హీరోయిన్స్ దొరకడమే కష్టమైపోయారు. ఆయనకే కాదు..సీనియర్ హీరోలకు హీరోయిన్స్‌ను వెతికి పట్టడం దర్శకులకు పెద్ద పనైంది. ఇక బాలకృష్ణ విషయానికి వస్తే.. ఈ నందమూరి హీరో ముచ్చటగా మూడోసారి బోయపాటితో చేస్తోన్న సినిమాకు సంబంధించి.. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో కన్నడ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్‌ను హీరోయిన్‌గా తీసుకోవాలనుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల కథనం. ఇప్పటి వరకు కన్నడ, తమిళ చిత్రాలకే పరిమితమైన శ్రద్ధా శ్రీనాథ్ నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తోన్న `జెర్సీ`తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ అమ్మడునే బాలకృష్ణ చిత్రంలో నటింప చేయాలనేది బోయపాటి ఆలోచన. మరి ఈ అమ్మడు ఓకే అంటుందా? లేదా? అని తెలియాలంటే కొంతకాలంగా ఆగాల్సిందే..