రైతన్న సినిమాను ఆదరించండి

114
watch & Encourage Rytanna movie
watch & Encourage Rytanna movie

రైతన్న సినిమాను చూసి ఆదరించాల‌ని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కోరారు. గురువారం మంత్రుల నివాస సముదాయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. సమాజ హితం కోసం అనేక మాద్యమాల ద్వారా పలువురు కృషి చేస్తుంటారని.. ఆర్ నారాయ‌ణ‌మూర్తి ప్రజల పక్షపాతి, రైతు పక్షపాతి అన్నారు. త‌ను ఎన్నో కష్టనష్టాల్ని భ‌రించి ఈ సినిమా నిర్మించార‌ని తెలిపారు. సినిమాలో మట్టికి, మనిషికి ఉన్న సంబంధాన్ని అద్భుతంగా ఆవిష్కరించార‌ని చెప్పారు. ప్రజల హితాన్ని కోరే సినిమాలు  చాలా అరుదుగా వస్తుంటాయని.. అందుకే రైతులు, ప్రజలు, మీడియాతో పాటు సమాజంలోని అందరూ ఈ సినిమాను చూడాలని సూచించారు. వ్యాపార విలువలే ప్రధానంగా ఉన్న పరిస్థితులలో ప్రజల కోసం, రైతుల హితం కాంక్షిస్తూ వస్తున్న ప్రభోధాత్మక సినిమాగా అభివ‌ర్ణించారు.

ప్రజా ప్రయోజనం జరిగే కృషి ఏ రంగంలో జరిగినా మనం స్వాగతించాలన్నారు. ఒక శ్యాం బెనగల్, ఒక మృణాల్ సేన్ మాదిరిగా తెలుగులో నారాయణమూర్తి సినిమాలను తీస్తున్నారని చెప్పారు. ఈ నెల 14న విడుదలవుతున్న రైతన్న సినిమాను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం తీసుకునే నిర్ణయాలు ప్రజలకు ఇబ్బంది కలిగించేవి అయినప్పడు స్పందించాల్సిన విపక్షాలు విస్మరిస్తున్నాయన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు తమకు వ్యతిరేకమని ప్రజలు ఒకసారి భావిస్తే వారే విపక్షపాత్ర పోషిస్తార‌ని గుర్తు చేశారు. అంశాలవారీగా హేతుబద్దతతో కూడిన విమర్శలను సమాజంలో అందరూ స్వాగతించాల్సిందేన‌ని తెలిపారు. కానీ ప్రస్తుత రాజకీయాలలో దురదృష్టవశాత్తు విమర్శ అంటే కువిమర్శ, తిట్లు, సంస్కారహీనత, రెచ్చగొట్టడం విమర్శలుగా మారాయ‌ని.. ఈ ధోరణి మంచిది కాదని హితువు ప‌లికారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here