ములుగు జిల్లా: వాజేడు మండల పరిధిలోని చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న బొగత జలపాతానికి జలకళ సంతరించుకుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గుట్టల పైనుండి వర్షపునీరు బొగత జలపాతానికి చేరడంతో ఉధృతంగా ప్రవహిస్తుంది. పచ్చటి కొండల నడుమ 50 అడుగుల ఎత్తు నుండి జలధారలు నేలకు రాలుతూ పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి.