Friday, November 15, 2024

హైయర్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీపై ఫోకస్ పెట్టాం

  • డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క
  • స్కూల్లో నర్సరీ నుంచి చదివే ప్రతి విద్యార్థికి సహకారం అందిస్తాం: మంత్రి పొన్నం

గతంలో ఈ రాష్ట్రాన్ని పాలన చేసిన ఎవరూ కూడా ఆలోచన చేయని విధంగా సిఎం రేవంత్ ఆధ్వర్యంలో మంత్రి మండలి మొత్తం ఆలోచన చేసిందే ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం’ అని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అన్నారు. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం లబ్ధిదారులకు చెక్కుల పంపిణీలో ఆయన మాట్లాడుతూ మన రాష్ట్రం నుంచి సివిల్స్, టిజిపిఎస్సీ పరీక్షలు రాస్తూ రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడేలా ఆర్థిక సాయాన్ని అందించాలని మొట్ట మొదటిసారిగా ఈ రాష్ట్ర చరిత్రలో ఒక్కో విద్యార్థికి రూ. లక్ష రూపాయలు ఈ పరీక్షకు తయారు అవుతున్న వారికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇది పెద్ద నగదు కాకపోయినప్పటికీ ఈ సాయం ద్వారా కొంత ఉపశమనం కలిగించేదన్నారు. విద్యా వ్యాప్తి కోసం దీన్ని సింగరేణి ఆర్థిక సాయం చేసిందన్నారు.

 

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఈ దేశ చరిత్రలో ఎవరూ కూడా ఆలోచన చేసి ఉండరని, పెద్ద ఎత్తున ఈ స్కూల్స్ మొట్ట మొదటి సారి మొదటి సంవత్సరంలోనే రూ. 5 వేల కోట్లతో నిధులు ఖర్చుపెట్టబోతుందన్నారు. రాష్ట్రంలో గతంలో రెసిడెన్షియల్ స్కూల్స్, ఇన్ఫ్రాస్టక్షర్ కోసం సంవత్సరానికి రూ.3 కోట్లు ఖర్చుపెట్టేదని, కానీ, ఈ సంవత్సరం తాము రూ. 5 వేల కోట్లకు పెంచామని ఇది తమ ప్రాధాన్యత అని ఆయన చెప్పుకొచ్చారు. విద్య కోసం అంగన్‌వాడీ దగ్గర నుంచి మొదలు కొని ప్రణాళికలు తయారు చేశామని ఆయన వెల్లడించారు.

హైయర్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీపై ఫోకస్ పెట్టామన్నారు. మరోవైపు నేడు రాష్ట్రానికి 4వ సిటీ రాబోతుందని, ఆ ప్రాంతంలో స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసినట్లు ఆయన తెలిపారు. టెక్నాలజీ పెరుగుతున్న క్రమంలో ఇండస్ట్రీలకు అనుగుణంగా సిలబస్‌ను తయారు చేసేందుకు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామన్నారు. స్కిల్ వర్సిటీలో చదివిన ప్రతి ఒక్కరికీ ఉద్యోగం వచ్చేలా కృషి చేస్తున్నామన్నారు. దాదాపు రాష్ట్రంలోని 63 ఐటీఐలు కళాశాలలు మూసివేసే పరిస్థితి వచ్చిందన్నారు. ఆ ఐటీఐలను అడ్వాన్స్ స్కిల్ సెంటర్‌లుగా భవిష్యత్‌లో అప్‌గ్రేడ్ చేస్తామని ఆయన తెలిపారు.

మెయిన్స్‌తో పాటు ఇంటర్వ్యూలోనూ విజయం సాధించాలి: మంత్రి పొన్నం
సివిల్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక సూచనలు చేశారు. రాజీవ్ గాంధీ అభయహస్తం పేరిట సివిల్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయి మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని సహాయ, సహకారాలు అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. మెయిన్స్‌తో పాటు ఇంటర్వ్యూలోనూ విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

స్కూల్లో నర్సరీ నుంచి చదివే ప్రతి విద్యార్థికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సహకారం ఉండాలన్నదే సిఎం రేవంత్ రెడ్డి ఆలోచన అని అన్నారు. రాష్ట్రం నుంచి సివిల్స్ మెయిన్స్‌కు 135 మంది ఎంపిక కావడం అభినందించదగ్గ విషయం అన్నారు. వీరంతా సక్సెస్ కావాలని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. అభ్యర్థులు కేవలం వారి తల్లిదండ్రులనే కాదని, మొత్తం తెలంగాణ గర్వించేలా చేయాలని ఆయన సూచించారు. ఒక్క నిమిషం కూడా నిర్లక్ష్యం చేయకుండా, ఏ ఒక్క అంశాన్ని కూడా వదిలిపెట్టకుండా ప్రిపేర్ కావాలని ఆయన చెప్పారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular