బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలను అడ్డుకుంటాం

హైదరాబాద్ :హైదరాబాద్ లో జులై 2,3, తేదీ లో జరిగే బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు అడ్డుకుంటామని మాదన్నపేట్ లో జరిగిన ఎం ఆర్ పీ ఎస్ కార్యకర్తల సమావేశంలో మంద కృష్ణ మాదిగ తెలిపారు.ఎస్సీ వర్గీకరణ చేయకుండా కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తు, మాదిగలకు అన్యాయం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశానికి వస్తున్న ప్రధానమంత్రి, మంత్రులు ఎస్సీ వర్గీకరణపై స్పష్టత ఇవ్వాలని కోరారు. జూలై 2న జాతీయ రహదారులపై,మాదిగ బస్తీలలో నిరసన వ్యక్తం చేస్తామన్నారు.జూలై 3న ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యాలయం పార్సిగుట్ట నుండి వినతి పత్రం తీసుకొని బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో జరిగే చోటుకు బారి ప్రదర్శనగా వెళ్ళానున్నామని వెల్లడించారు. ఎక్కడైనా పోలీసులు అడ్డుకున్నా హైదరాబాద్ ను దిగ్బంధం చేస్తామంటూ హెచ్చరించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article