-
ముంపు బాధితులoదరినీ ఆదుకుంటాం
-
విపత్తు నుంచి గట్టెక్కేందుకు సమిష్టి కృషి
-
ముంపు బాధితులను ఆదుకునేందుకు దాతల అండ అభినందనీయం
-
రాష్ట్ర మైనార్టీ సంక్షేమ, న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని
విజయవాడ, సెప్టెంబర్ 7: విజయవాడ లో బుడమేరు వరద బీభత్సంతో అతలాకుతలమైన ముంపు బాధితులు అందరినీ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ న్యాయ శాఖ మంత్రి ఎన్ ఎండి ఫరూక్, విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివ నాథ్ (చిన్ని ) పేర్కొన్నారు.
శనివారo విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం లోని రామకృష్ణపురం ప్రాంతంతో పాటు అజిత్ సింగ్ నగర్, కంద్రిక, దుర్గపురం, న్యూ ఆర్ఆర్ పేట, పైపుల రోడ్డు, పంజా సెంటర్ తదితర ప్రాంతాల్లో వరద బాదితులకు నంద్యాల నుంచి మంత్రి ఫరూక్ ఆధ్వర్యంలో 6000 మందికి దుప్పట్ల పంపిణి కార్యక్రమం జరిగింది. ఎన్ ఎండి ఫరూక్, ఎంపీ కేశినేని శివనాధ్( చిన్ని), ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షులు మొహమ్మద్ ఫరూక్ షిబ్లీ తదితరుల చేతుల మీదుగా దుప్పట్లను వరద బాధితులకు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఫరూక్, ఎంపీ కేశినేని చిన్ని స్థానికులను ఉద్దేశించి మాట్లాడారు. విజయవాడ నగరాన్ని కనీవిని ఎరుగని రీతిలో గతంలో ఎన్నడూ లేని విధంగా వరద ముంచిందని ఆవేదన వ్యక్తం చేశారు.*ముంపు బాధితులను అందరిని ఆదుకోవడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అన్ని ప్రభుత్వ శాఖలు,మంత్రివర్గం, స్వచ్ఛంద సేవా సంస్థలు, అధికార యంత్రాంగం, వివిధ ప్రాంతాల నుంచి స్వచ్ఛందంగా వచ్చిన ప్రజలందరి సమిష్టి కృషితో ముంపు ప్రాంతాలలో క్షేత్రస్థాయిలో ఆదుకునే చర్యలను పగడ్బందీగా నిర్వహించడం జరుగుతున్నదని పేర్కొన్నారు సర్వం కోల్పోయిన వారిని ఆదుకునేందుకు దాతలు అందిస్తున్న ఆపన్న హస్తం ఎంతో అభినందనీయమని, ముఖ్యమంత్రి సహాయ నిధికివిరాళాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి, ముంపు బాధితులను ఆదుకునేందుకు వివిధ రూపాల్లో చేయూతనందిస్తున్న దాతలు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నామని మంత్రి ఫరూక్,కేశినేని చిన్ని పేర్కొన్నారు. అంటు వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ చర్యలను ముమ్మరం చేయడం జరిగిందని, నిత్యవసర సరుకుల కిట్ల పంపిణీ లో వరద బాధితులందరికి అందేలా ఒక ప్రణాళిక ప్రకారం కార్యాచరణ చర్యలు జరుగుతున్నాయని ఫరూక్, చిన్ని పేర్కొన్నారు.