కాకినాడ : కాకినాడ జిల్లా గండేపల్లి మండలం తాళ్లూరు నేషనల్ హైవే పై శుక్రవారం తెల్లవారుజామున పెళ్లి బస్సు బోల్తా పడింది. విజయనగరం జిల్లా నుంచి ఏలూరు పెళ్లి బృందంతో బస్సు వెళుతుంది. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటనలో ఒకరు మృతి చెందగా, మిగిలినవారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను వైద్యం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.