ఈ వారం తెలుగు వారఫలాలు

Weekly Astrology Predictions

మేషరాశి : ఈవారం  మొత్తం మీద సంతానం నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. కొన్ని కొన్ని విషయాల్లో మీ మాటతీరు ఇతరులకు ఇబ్బంది పెట్టె అవకాశం ఉంది, కాస్త చూసుకోగలరు. కుటుంబంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు,పెద్దలతో మీ ఆలోచనలు పంచుకుంటారు . మిత్రులను కలుస్తారు, వారితో కలిసి సమయాన్ని సరదాగా గడుపుతారు. చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందకపోవడం మంచిది. అనుకోకుండా ప్రయాణాలు చేయవల్సి వస్తుంది. మీ మాటతీరు లో కొంత కోపం పెరుగుటకు ఆస్కారం ఉంది, కాస్త ఈ విషయంలో చూసుకోండి. ఎవరికన్నా ఆర్థికపరమైన సహాయం చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయుట ఉత్తమం.

వృషభరాశి :ఈవారం మొత్తం మీద మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుతారు. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. తండ్రితరుపు బంధువుల నుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. అనవసరమైన విషయాలకు దూరంగా ఉండుట సూచన. వ్యాపారపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు, పెట్టుబడుల కోసం చేసిన ప్రయత్నాలు ముందుకు వస్తాయి. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు.విదేశీ ప్రయాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి, విదేశాల్లో ఉన్న మిత్రులనుండి నూతన విషయాలు తెలుస్తాయి. ఆరోగ్యం విషయాల్లో కాస్త జాగ్రత్తలు తీసుకోండి. అధికారులతో లేక పెద్దలతో విభేదాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి.

 

మిథునరాశి: ఈవారం మొత్తం మీద నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మీ ఆలోచనల్లో మార్పువచ్చే ఆస్కారం ఉంది. చర్చాపరమైన విషయాలకు దూరంగా ఉండుట సూచన. వారం చివరలో మానసికపరమైన ఇబ్బందులు కలిగే ఆస్కారం ఉంది. ఉద్యోగంలో బాగానే ఉంటుంది, చేపట్టిన పనులకు మంచి గుర్తింపు లభిస్తుంది. బంధువుల నుండి చక్కటి సహకారం లభిస్తుంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. తండ్రితరుపు బంధువులలో ఒకరి ఆరోగ్యం ఒకింత ఆందోళన కలిగిస్తుంది. మీ ఆలోచనలు లేదా మాటతీరు కొంతమందికి నచ్చకపోవచ్చును. ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. 
కర్కాటకరాశి :ఈవారం మొత్తం మీద తండ్రితరుపు బంధువుల నుండి నూతన విషయాలు తెలుస్తాయి. వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో ఇతరులకు మాటఇచ్చే ముందు కాస్త ఆలోచన చేయుట సూచన. విదేశాల్లో ఉన్నవారికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుతారు. కుటుంబంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దలతో మీ ఆలోచనలు పంచుకుంటారు. కోపాన్ని కలిగి ఉంటారు , సర్దుబాటు విధానం మంచిది. అనుకోకుండా ప్రయాణాలు చేయవల్సి వస్తుంది. వ్యాపారపరమైన విషయాల్లో అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. 
 
సింహరాశి :ఈవారం మొత్తం మీద   మీ ఆలోచనల్లో స్పష్టమైన మార్పు ఉంటుంది. దైవపరమైన విషయాల్లో సమయాన్ని గడుపుతారు. ఆరోగ్యం విషయంలో కొంత ఇబ్బంది వచ్చిన వెంటనే సర్దుకుంటుంది. బంధువుల నుండి ముఖ్యమైన సమాచారం పొందుతారు. సోదరులతో చర్చలు చేయుటకు ఆస్కారం ఉంది, ఆశించిన మేర సహకారం లభిస్తుంది. మీ ఆలోచనల్లో నూతనత్వం ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది. పెద్దలతో మీ ఆలోచనలు పంచుకుంటారు. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా బదిలీ ఉండే అవకాశం ఉంది. సంతానం విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.

కన్యారాశి :ఈవారం మొత్తం మీద దైవపరమైన విషయాలకు సమయం ఇస్తారు. గతంలో చేపట్టిన పనుల వలన సమాజంలో మంచి గుర్తింపును పొందుతారు. సంతానం విషయంలో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. ఉద్యోగంలో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. చిన్న చిన్న పనులను పట్టించుకుకోకండి, ముఖ్యమైన పనులకు ప్రాధాన్యం ఇవ్వడం సూచన. సంతానం విషయంలో నూతన నిర్ణయాలు తీసుకుంటారు, అలాగే వారి ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. పెద్దలతో మీకున్న పరిచయం మరింతగా బలపడుతుంది. వ్యాపారపరమైన విషయాల్లో మాత్రం కాస్త ఇబ్బందులు తప్పక పోవచ్చును. దూరదృష్టిని కలిగి ఉండుట సూచన. బంధువులను కలుస్తారు.

తులారాశి: ఈవారం  మొత్తం మీద పూజాదికార్యక్రమాల్లో పాల్గొంటారు. అధికారులతో కలిసి నూతన పనులను మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. ఆత్మీయుల నుండి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. స్వల్పదూరప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది, స్పష్టమైన ప్రణాళిక మేలుచేస్తుంది. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. పెద్దలనుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోండి. తండ్రితరుపు బంధువులను కలుస్తారు , వారితో మీ ఆలోచనలు పంచుకుంటారు. సంతానం నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. సమాజంలో మంచి గుర్తింపును పొందుతారు.
 
వృశ్చికరాశి :ఈవారం  మొత్తం మీద ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయుట సూచన. ఎవరికన్నా రుణపరమైన సహాయం చేసేముందు బాగా ఆలోచించి ముందుకు వెళ్ళండి. బద్ధకం వీడి ఒకింత గట్టిగా ప్రయత్నం చేయుట మంచిది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. కుటుంబంలో చిన్న చిన్న విషయాలకు ప్రాధాన్యత ఇవ్వండి అలాగే మీ ఆలోచనలను పెద్దలకు తెలియజేయుట సూచన. సోదరులతో మీ ఆలోచనలు పంచుకుంటారు. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. విలువైన వస్తవులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. సంతానం విషయంలో ముఖ్యమైన ఆలోచనలు చేస్తారు.

ధనస్సురాశి:ఈవారం  మొత్తం మీద స్పష్టమైన ఆలోచనలు కలిగి ఉండి , నిర్ణయాలు తీసుకోవడంలో ఏమాత్రం తొందరపాటు వద్దు. కొంత సొంత విషయాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో వివాదాలకు అవకాశం ఇవ్వకండి, సర్దుబాటు విధానం కలిగి ఉండుట సూచన. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆరంభంలో తడబాటు పొందుతారు. కుటుంబంలో మీకంటూ ఒక విధానం ఉంటుంది. వ్యాపార పరమైన విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఆరోగ్యం విషయాల్లో మాత్రం ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. స్త్రీ సంభందమైన విషయాల వలన లబ్దిని పొందుతారు. సోదరులతో మీ ఆలోచనలు పంచుకుంటారు. 

మకరరాశి :ఈవారం మొత్తం మీద నూతన ప్రయత్నాలను చేయుటకు ఆస్కారం ఉంది. దూరప్రదేశంలో ఉన్న మిత్రులనుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. స్వల్పదూరంలో ఉన్న ప్రదేశాలు చూసే ఆస్కారం ఉంది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. బంధువులను కలుసుకుంటారు, వారినుండి నూతన విషయాలు తెలుస్తాయి. సోదరులతో మీ ఆలోచనలు పంచుకుంటారు. ఉద్యోగంలో అధికారుల నుండి ఆశించిన మేర సహకారం పొందుతారు. వాహనాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. విలువైన వస్తువులను కొనుగోలు చేసే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం.

కుంభరాశి :ఈవారం మొత్తం మీద చిన్న చిన్న విషయాలను మిత్రులనుండి తెలుసుకుంటారు. చేపట్టిన పనులను పూర్తిచేయుటకు కాస్త సమయం పడుతుంది. మీ మాటతీరు పెద్దలను ఆకట్టుకుంటుంది, ముఖ్యమైన విషయాల్లో ఆరంభంలో తడబాటు ఉంటుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేసేముందు అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. సంతానం విషయంలో సర్దుబాటు అవసరం. మీ మాటతీరు పెద్దలను ఆకట్టుకుంటుంది. వారినుండి వచ్చే సూచనలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. అధికారులతో కలిసి నూతన ప్రయత్నాలు మొదలు పెడతారు. మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుతారు.

మీనరాశి :ఈవారం  మొత్తం మీద మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుతారు. రావల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. మానసికంగా దృడంగా ఉండుట వలన మేలుజరుగుతుంది. చర్చాపరమైన విషయాల్లో మీదైనా ఆలోచనలు కలిగి ఉంటారు, కాస్త శ్రమించుట ద్వారా మేలుజరుగుతుంది. నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. సమయాన్ని చర్చలకు కేటయించే అవకాశం ఉంది. ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. వ్యాపారరంగంలో ఉన్నవారు అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. కుటుంబంలో శుభకార్యాలకు ఆస్కారం ఉంది.  
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article