17-02-2019 నుండి 23-02-2019 వరకు వారఫలాలు

Weekly Horoscope 17-02-2019 to 23-02-2019

మేషరాశి : ఈవారం కుటుంబ పరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండుట అలాగే ఎవరికైనా రుణపరమైన విషయాల్లో మాటఇచ్చే ముందు కాస్త ఆలోచన చేయండి. దైవపరమైన విషయాల్లో పాల్గొంటారు. గతంలో చేపట్టిన పనుల మూలన నలుగురిలో మంచి పేరు లభిస్తుంది. కుటుంబంలో నూతన ఆలోచనలకు ప్రాధాన్యం ఇస్తారు. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. సాధ్యమైనంత మేర కోపాన్ని తగ్గించుకోవడం సూచన.  

వృషభరాశి : ఈవారం ఉద్యోగంలో అధికారుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది, నూతన ప్రదేశాలు చేసే ఆస్కారం ఉంది. ఆత్మీయులను కలుసుకుంటారు, విలువైన వస్తువులను కొనుగోలు చేయాలనే ఆలోచన వాయిదా వేయుట సూచన. సంతానపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది, తగ్గించుకోవడం కన్నా మంచి పనులకు ధనం ఖర్చు పెట్టుకోవడం మంచిది. బంధువుల నుండి నూతన విషయాలు తెలుస్తాయి. మిత్రులనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది.
 
మిథునరాశి: ఈవారం ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు పొందుతారు. ప్రయాణాలు చేయునపుడు తగైన్ జాగ్రత్తలు తీసుకోండి.సంతానం విషయంలో గతంలో ఉన్న ఆందోళన అలాగే  ఆలోచనలు తగ్గుముఖం పడుతాయి.రావాల్సిన ధనము సమయానికి చేతికి అందుతుంది. పెద్దలతో మీకున్న పరిచయం బలపడుతుంది, వారి సూచనల మేర ముందుకు వెళ్ళండి. తండ్రితరుపు బంధువులను కలుస్తారు. కుటుంబంలో సభ్యులతో ముఖ్యమైన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. విలువైన వస్తువులను లేదా వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది.
కర్కాటకరాశి : ఈవారం నూతన పరిచయాలకు అవకాశం ఉంది, మిత్రులతో మీరు సమయాన్ని సరదాగా గడుపుతారు. ముఖ్యమైననిర్ణయాల్లో తడబాటు ఉంటుంది, నిర్ణయం తీసుకొనే ముందు బాగా ఆలోచించి ముందుకు వెళ్ళండి. సంతానం నుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోండి. బంధువుల నుండి వచ్చే సూచనలను పరిగణలోకి తీసుకోండి. జీవిత భాగస్వామితో విభేదాలు పెరుగుటుకు ఆస్కారం ఉంది, జాగ్రత్త. ఆరోగ్యం విషయంలో మాత్రం ఏమాత్రం అశ్రద్ధ వద్దు. విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి తిరిగి వచ్చే ఆస్కారం ఉంది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది.
 
సింహరాశి : ఈవారం ఆరంభంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉన్న , ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుతారు. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు సూచితం. సంతానం నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో అధికారుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది . అలాగే నూతన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. బంధువులతో విభేదాలు రాకుండా తగైనా జాగ్రత్తలు తీసుకోండి. మానసికంగా దృడంగా ఉండుట సూచన. స్వల్పదూర ప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు.
 
కన్యారాశి : ఈవారం బంధువుల నుండి నూతన విషయాలు తెలుస్తాయి, మీరు ఒకటికి రెండుసార్లు ఆలోచన చేసుకోండి ఆతరువాతే నిర్ణయం తీసుకోండి. కుటుంబంలో శుభకార్యాలకు అవకాశం ఉంది. సోదరులతో చర్చలు చేయుటకు అవకాశం ఉంది. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. సంతానం విషయంలో ఒకింత ఆందోళన తప్పక పోవచ్చును. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం అలాగే వాటికోసం ధనం ఖర్చు అయ్యే అవకాశం కలదు.
 
తులారాశి: ఈవారం ఉద్యోగంలో బాగుంటుంది, అధికారుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేసే ఆస్కారం ఉంది. అనుకోకుండా ప్రయాణాలు చేయవల్సి రావోచ్చును. రావల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది అలాగే నూతన ఆర్థికప్రయత్నాలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో ఆందోళన తప్పక పోవచ్చును. జీవితభాగస్వామితో విభేదాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో మాత్రం ఏమాత్రం అశ్రద్ధ కూడదు. మీ మాటతీరులో స్వార్థ ప్రయోజనాలు అధికంగా కనబడే అవకాశం ఉంది.
 
వృశ్చికరాశి : ఈవారం పెద్దలను కలుస్తారు, వారినుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. అలాగే మీ ఆలోచనలను పెద్దలతో పంచుకుంటారు. మీ మాటతీరు కొంతమందిని ఆశ్చర్యంలో పడవేస్తుంది. అలాగే ముఖ్యమైన నిర్ణయాలు తొందరపాటు పనికిరాదు. మిత్రులతో విభేదాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. కుటుంబపరమైన విషయాల్లో నూతన ఆలోచనలకు ప్రాధాన్యం ఇస్తారు. సాధ్యమైనంత మేర వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండుట సూచన. ఆత్మీయుల నుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి, వారితో కలిసి సమయాన్ని సరదాగా గడుపుతారు.
 
ధనస్సురాశి: ఈవారం విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. సాధ్యమైనంత మేర అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండుట సూచన. ఉద్యోగంలో బాగానే ఉంటుంది. అధికారులతో కలిసి నూతన పనులను మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. చర్చాపరమైన విషయాల్లో సమయం గడుపుతారు. మిత్రులతో కలిసి దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. సంతానం విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి, అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి.
 
మకరరాశి :ఈవారం పెద్దలతో కలిసి చేపట్టిన పనుల వలన నలుగురిలో మంచి గుర్తింపును పొందుతారు. విలువైన వస్తువుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్య పరమైన సమస్యలు మిమ్మల్ని ఒకింత ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది. దైవపరమైన విషయాలకు సమాయం ఇస్తారు. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. నూతన ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. వ్యాపారపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు చేయుటకు ఆస్కారం ఉంది, ఆశించిన మేర పెట్టుబడులకు అవకాశం కలదు. విదేశీప్రయత్నాలు కలిసి వస్తాయి.
 
కుంభరాశి :ఈవారం అధికారుల నుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. వారితో మీకు గతంలో ఉన్న పరిచయాలు ఉపయోగపడుతాయి. వ్యాపారపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. కొన్ని కొన్ని విషయాల్లో మీ మాటతీరు కొంతమందికి ఇబ్బందిని కలిగించే అవకాశం ఉంది. చిన్న చిన్న విషయాలను సైతం అశ్రద్ధ చేయకండి. సోదరులతో మీ ఆలోచనలు పంచుకుంటారు, వారినుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోండి. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుటకు ఆస్కారం ఉంది.
 
మీనరాశి : ఈవారం తండ్రితరుపు బంధువులలో ఒకరి ఆరోగ్యపరమైన ఇబ్బందులు మిమ్మల్ని ఆందోళనకు గురిచేసే అవకాశం ఉంది. ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. వ్యాపార పరమైన విషయాల్లో బాగానే ఉంటుంది , నూతన అవకాశాల కోసం చేసే ప్ర్తయత్నాలు ముందుకు సాగుతాయి. విదేశాల్లో ఉన్న మిత్రులనుండి నూతన విషయాలు తెలుస్తాయి. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. సంతానం విషయంలో సంతోషమును పొందుతారు. ఉద్యోగంలో నూతన అవకాశాలు పొందుతారు. స్త్రీ పరమైన విషయాల్లో కాస్త నిదానం అవసరం. చర్చల్లో సమయం గడుపుతారు.
డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),
ఎం. ఎ (వేదాంగజ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article