27-01-2019 నుండి 02-02-2019 వరకు వారఫలాలు

WEEKLY Horoscope From 27th Jan To 02-02-2019

మేషరాశి :ఈవారం పెద్దలను కలుస్తారు వారితో మీ ఆలోచనలు పంచుకుంటారు. వారినుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం సూచన. సోదరులతో ఊహించని విధంగా వివాదాలు జరుగుటకు అవకాశం ఉంది, కాస్త సర్దుబాటు విధానం మంచిది. ఆత్మీయులను కలుసుకునే అవకాశం ఉంది. వారినుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. సంతానం నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది.   

వృషభరాశి : ఈవారం బంధువులను కలుస్తారు , వారితో కలిసి సమయాన్ని సరదాగా గడుపుతారు. ఉద్యోగంలో పెద్దలను కలుస్తారు. తలెపట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే ఆస్కారం ఉంది. మిత్రులతో కలిసి ముఖ్యమైన పనులను చేపట్టుటకు అవకాశం ఉంది. వ్యాపార పరమైన విషయాలలో నూతన పెట్టుబడులకు ఆస్కారం ఉంది. మానసికంగా దృడంగా ఉండుట సూచన. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. స్థిరాస్తి పరమైన విషయాల్లో భూమి కొనుగోలు చేయుటకు ఆస్కారం కలదు.


మిథునరాశి: ఈవారం ఉద్యోగంలో అధికారులతో కలిసి నూతన పనులను చేపట్టుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. పెద్దలతో మీకున్న పరిచయం మరింతగా బలపడుతుంది. సంతానం నుండి నూతన విషయాలు తెలుసుకుంటారు. విదేశాల్లో ఉన్న మిత్రులనుండి ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు. కుటుంబపరమైన విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ ఆలోచనలు పెద్దలకు తెలియజేసే ప్రయత్నం చేస్తారు. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. 


కర్కాటకరాశి :ఈవారం మిత్రులతో మీ ఆలోచనలు పంచుకుంటారు. స్వల్పదూర ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. చేపట్టిన పనుల వలన నలుగురిలో మంచి గుర్తింపును పొందుతారు. సంతానం నుండి నూతన విషయాలు తెలుస్తాయి, వారితో కలిసి చేయు ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. జీవితభాగస్వామి తో కలిసి ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్ లేక బదిలీ వచ్చుటకు అవకాశం ఉంది. రావాల్సిన ధనం విషయంలో స్పష్టత ఉండుట వలన మేలుజరుగుతుంది. చర్చల్లో నిదానముగా ఉండుట సూచన. 


సింహరాశి :ఈవారం చేపట్టు పనుల విషయంలో స్పష్టత అవసరం. సాదేమైనంత మేర అనవసరమైన విషయాలకు దూరంగా ఉండుట సూచన. సంతానం విషయంలో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. దైవపరమైన విషయాలకు సమయం ఇస్తారు. ఉద్యోగంలో నూతన అవకాశాలు పొందుతారు, ఆశించిన మేర సహకారం పెద్దలనుండి లభిస్తుంది. విలువైన వస్తువులను పొందుతారు. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడులకు ఆస్కారం ఉంది. విదేశాల్లో ఉన్న మిత్రులనుండి ముఖ్యమైన సమాచారం పొందుతారు. చర్చాప్రమైన విషయాలకు కాస్త దూరంగా ఉండుట సూచన. 


కన్యారాశి : ఈవారం ఎక్కువగా ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను ముందుగా పూర్తిచేయుట సూచన. నూతన పరిచయాలకు అవకాశం ఉంది, పెద్దలనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. అనుకోకుండా దూరప్రదేశాలు ప్రయాణం చేయవల్సి వస్తుంది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందక పోవచ్చును. పూజాదికార్యక్రమాల్లో పాల్గొంటారు. మిత్రులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది, కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. సంతానం నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. నూతన నిర్ణయాలు తీసుకుంటారు.  


తులారాశి:ఈవారం పెద్దలను కలుసుకుంటారు , వారితో మీ ఆలోచనలు పంచుకుంటారు. చేపట్టిన పనుల విషయంలో స్పష్టత ఉండుట వలన మేలుజరుగుతుంది. సంతానం విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. ఉద్యోగంలో అధికారులను కలుసుకుంటారు, వారి సూచనల మేర ముందుకు వెళ్ళుట సూచన. ఆరోగ్యం విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోండి. స్వల్పదూరప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు సూచితం. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతాయి. బంధువుల నుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. చర్చల్లో పాల్గొంటారు.


వృశ్చికరాశి :ఈవారం ఆరంభంలో చిన్న చిన్న ఇబ్బందులు కలుగుటకు ఆస్కారం ఉంది. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేయుటకు ఆస్కారం ఉంది. వ్యాపార పరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి , సర్దుబాటు విధానం మంచిది. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ వద్దు. అధికారులతో విభేదాలు రాకూండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఆత్మేయుల నుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి, వారి సూచనల మేర ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. 


ధనస్సురాశి:ఈవారం కుటుంబంలో కీలకమైన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది, పెద్దలను కలుస్తారు. గతంలో చేపట్టిన పనులను పూర్తిచేయుటకు తోటివారి సహకారం తీసుకుంటారు. అనుకోకుండా ప్రయాణాలు చేయవల్సి వస్తుంది. చిన్న చిన్న విషయాలకే ఆందోళన చెందుటకు ఆస్కారం ఉంది. రావల్సిన ధనం సమయానికి చేతికి అందిన , అంతకు మించి ఖర్చులు ఉండే అవకాశం ఉంది. వాహనాల వలన ఇబ్బందులు కలుగుటకు ఆస్కారం ఉంది, కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు ఆస్కారం ఉంది, వినోదాల్లో సమయాన్ని గడుపుతారు.


మకరరాశి :ఈవారం ఆరంభంలో చిన్న చిన్న ఇబ్బందులు కలుగుటకు ఆస్కారం ఉంది. దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం సూచన. కుటుంబపరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులను వారం చివరలో పూర్తిచేసే ఆస్కారం ఉంది. ఉద్యోగంలో మార్పును కోరుకుంటరు. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. పెద్దలతో మీకున్న పరిచయం బలపడుతుంది. విదేశీప్రయాణాలు చేయాలనుకొనే వారికి అనుకూలమైన సమయం. చర్చాపరమైన విషయాలకు దూరంగా ఉండుట సూచన.
    
కుంభరాశి :ఈవారం ఉద్యోగంలో బాగాఉంటుంది, అధికారులతో మీ ఆలోచనలు పంచుకుంటారు. ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. వ్యాపార పరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం సూచన. బంధువులను కలుస్తారు వారితో కలిసి మీ లోచనలు పంచుకుంటారు. నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు ఆస్కారం ఉంది. విదేశీప్రయాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి, కాస్త శ్రమించుట ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి, సర్దుబాటు విధానం వలన తప్పక మేలుజరుగుతుంది. 


మీనరాశి :ఈవారం ఆశించిన మేర సహకారం లభ్సితుంది. పెద్దలతో కలిసి నూతన ప్రయత్నాలు చేయుటకు అవకాశం కలదు. చిన్న చిన్న విషయాలకే హైరానా చెందుతారు. రావాల్సిన ధనం కాస్త ఆలస్యంగా చేతికి అందుతుంది. వ్యాపార పరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు సూచితం. గతంలో మీరు తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండుట సూచన. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. స్వల్పఅనారోగ్య సమస్యలు తప్పక పోవచ్చును, ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. మిత్రులతో మీ ఆలోచనలు పంచుకుంటారు. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. సర్దుబాటు విధానం మేలుచేస్తుంది.
 
డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),
ఎం. ఎ (వేదాంగజ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article