13-01-2019 నుండి 19-01-2019 వరకు వారఫలాలు

Weekly Horoscope From 13th To 19th Jan
మేషరాశి :ఈవారం మొత్తం మీద కుటుంబపరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. తండ్రితరుపు బంధువుల నుండి ముఖ్యమైన సమాచారం పొందుతారు. వాహనాల విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. సంతానం విషయంలో గతంలో తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండటం వలన తప్పక మేలుజరుగుతుంది. మొదట్లో కాస్తా ఇబ్బందిగా ఉన్న స్పష్టమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది, తగ్గించుకోవడంలో విఫలం అవుతారు. పెద్దలతో మీ ఆలోచనలు పంచుకుంటారు. గతంలో చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేయుట సూచన.

వృషభరాశి :ఈవారం మొత్తం మీద ముఖ్యమైన విషయాలకు సమయం ఇవ్వడం సూచన. ఉద్యోగంలో అధికారులకు సూచనలు పాటించుట వలన మేలుజరుగుతుంది. బద్ధకం వీడి స్పష్టమైన లక్యంతో ముందుకు వెళ్ళండి. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేయకండి, సమయానికి భోజనం చేయుట సూచన. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పరిచయాలకు ఆస్కారం ఉంది, కాస్త ప్రయత్నం చేయుట మంచిది. దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం సూచన. నూతన పరిచయాలకు ఆస్కారం ఉంది. ఉద్యోగాల్లో బాగానే ఉంటుంది. మరింతగా శ్రమించుట ద్వారా మరిన్ని ఉన్నతమైన ఫలితాలు పొందవచ్చును.
మిథునరాశి: ఈవారం మొత్తం మీద మధ్యలో ఆగిన పనులను పూర్తిచేసే ఆస్కారం ఉంది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతాయి. బంధువులను కీలకమైన నిర్ణయాలు తెలుసుకుంటారు. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. సాధ్యమైనంత మేర ఖర్చులను తగ్గించుకోండి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి, వాతైకోసం చేసిన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. కుటుంబపరమైన విషయాల్లో ఆచితూచి వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది. సంతానం విషయంలో పెద్దలను కలుసుకునే ఆస్కారం ఉంది. ముఖ్యమైన విషయాల్లో కాస్త ఆలస్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి.
కర్కాటకరాశి :ఈవారం మొత్తం మీద పూజాదికార్యక్రమాలకు సమయం ఇవ్వడం మంచిది. సంతానం విషయంలో నూతన నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని కొన్ని విషయాల్లో మీ మొండి నిర్ణయాలు మీకు మేలుచేస్తాయి. ఆరోగ్యం విషయంలో గతంలో ఉన్న ఇబ్బందులు తగ్గుముఖం పడుతాయి. మరింత జాగ్రత్తలు తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. వారం చివరలో అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది, చర్చాపరమైన విషయాల్లో పాల్గొనే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి. వ్యాపారపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. పెద్దలతో గతంలో ఉన్న విభేదాలు తగ్గుటకు ఆస్కారం ఉంది , కాస్త మీ వంతు ప్రయత్నం చేయుట సూచన.
సింహరాశి :ఈవారం మొత్తం మీద నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపాటు వద్దు, అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. కుటుంబంలో చర్చలకు ఆస్కారం ఉంది, నూతన నిర్ణయాలు తీసుకుంటారు. మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుటకు ఇష్టపడుతారు. వాహనాల వలన ఇబ్బందులు తప్పక పోవచ్చును. మొదట్లో కాస్త ఇబ్బందులు తప్పక పోవచ్చును, జాగ్రత్తగా ముందుకు వెళ్లడం వలన మేలుజరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది. ఉద్యోగంలో కాస్త సమయపాలన పాటించుట అలాగే ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకపోవడం వలన తప్పక మేలుజరుగుతుంది.
 
కన్యారాశి :ఈవారం మొత్తం మీద విదేశీప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. నూతన వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. ఆరోగ్యం విషయాల్లో ఏమాత్రం అశ్రద్ధ వద్దు. పెద్దలతో మీ ఆలోచనలు పంచుకుంటారు, వారినుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. చర్చాపరమైన విషయాల్లో పాల్గొనేందుకు ఆసక్తిని చూపిస్తారు. దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం మంచిది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు వారం చివరలో కలిసి వస్తాయి, స్పష్టమైన ఆలోచనలతో ముందుకు వెళ్లడం మంచిది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. నూతన పరిచయాలు ఏర్పడుతాయి.
 
తులారాశి:ఈవారం మొత్తం మీద మీ మాటతీరులో స్పష్టమైన మార్పు వచ్చే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. కుటుంబపరమైన విషయాల్లో ఇబ్బందులు తప్పకపోవచ్చును. అనుకోకుండా దూరప్రదేశ ప్రయాణాలు చేయవల్సి వస్తుంది. పెద్దలతో పరిచయాలు ఏర్పడుతాయి. సోదరులతో చేపట్టిన చర్చలు మిశ్రమ ఫలితాలు ఇస్తాయి, నూతన ఆలోచనలను కలిగి ఉంటారు. సంతానపరమైన విషయాల్లో నూతన నిర్ణయాలు తీసుకుంటారు. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. ఆరోగ్యం విషయంలో సానుకూల ఫలితాలు వస్తాయి, కాస్త మరింత జాగ్రత్త తీసుకోవడం మంచిది. మిత్రులతో మీ ఆలోచనలు పంచుకుంటారు.
 
వృశ్చికరాశి :ఈవారం మొత్తం మీద విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. అనుకోకుండా ప్రయాణాలు చేయవల్సి వస్తుంది. పెద్దలతో మీకున్న పరిచయం మరింతగా బలపడే ఆస్కారం ఉంది. సంతానం విషయంలో సానుకూల మార్పులు కలుగుతాయి. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. ముఖ్యమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు సూచితం. చర్చాపరమైన విషయాలకు దూరంగా ఉండుట సూచన మీ మాటతీరు నూతన వివాదాలకు దారితీసే అవకాశం కలదు, కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. పెద్దలనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతాయి.
ధనస్సురాశి:ఈవారం మొత్తం మీద  ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. ఊహించని ఖర్చులకు ఆస్కారం ఉంది. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. వ్యాపార పరమైన విషయంలో మిశ్రమ ఫలితాలు పొందుతారు. స్త్రీ పరమైన విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. వ్యాపారపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. ఉద్యోగంలో చేసిన నూతన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. విదేశాలలో ఉన్న మిత్రులనుండి నూతన విషయాలు తెలుస్తాయి. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. పెద్దలతో విభేదాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
 
మకరరాశి :ఈవారం మొత్తం మీద స్వల్పదూర ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. మానసికంగా దృడంగా ఉండుట సూచన. నూతన వ్యాపారాల విషయంలో ముఖఃమైన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. నూతన వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. కుటుంబపరమైన విషయంలో నిర్ణయాలు తీసుకొనే ముందు వారై అభిప్రాయాలను తెలుసుకోవడం మంచిది. నూతన వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. తండ్రి తరుపు బంధువులను కలుస్తారు. మీ దగ్గరి వ్యక్తుల ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసే ఆస్కారం ఉంది. ఆత్మీయుల నుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి, వాటి గురుంచి బాగాఆలోచించి ముందుకు వెళ్ళండి.
 
కుంభరాశి :ఈవారం మొత్తం మీద నిర్ణయాలు తీసుకొనే విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి ముందుకు వెళ్ళండి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు పొందుతారు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది , ఈ విషయంలో అనుభవజ్ఞుల సూచనలు పరిగణలోకి తీసుకోవడం మంచిది. మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుతారు. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. వ్యాపార పరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు సూచితం. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశాల్లో ఉన్న మిత్రులనుండి ముఖ్యమైన సమాచారం తెలుసుకుంటారు. ఉద్యోగంలో ప్రదేశం మార్పుకు అవకాశం కలదు. చర్చల్లో పాల్గొంటారు.
 
మీనరాశి :ఈవారం మొత్తం మీద మిత్రులతో సమయాన్ని గడుపుతారు, నూతన పరిచయాలు ఏర్పడుతాయి. చర్చాపరమైన విషయాలకు దూరంగా ఉండుట సూచన. మీ ఆలోచనలకు పెద్దలనుండి మంచి గుర్తింపు లభిస్తుంది. నూతన అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. వ్యాపారంలో బాగాఉంటుంది. విదేశాల్లో ఉన్న మిత్రులనుండి ఊహించని సహకారం పొందుతారు. సంతానం విషయాల్లో సంతృప్తి ఉంటుంది. చిన్న చిన్న విషయాలకే హైరానా చెందుతారు. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. బంధువులతో సర్దుబాటు విధానం అలాగే చర్చలో నిదానంగా వ్యవహరించుట సూచన. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. 
 
డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),
ఎం. ఎ (వేదాంగజ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article