భ‌వ్య కేసులో.. అస‌లేం జ‌రిగింది?

84
What happened in 'Bavya' Case?
What happened in 'Bavya' Case?

What happened in ‘Bavya’ Case?

‌వ్య ఆనంద్ ప్ర‌సాద్ కేసులో మీడియా అత్యుత్సాహం చూపెడుతోందా? ‌కొన్ని సంస్థ‌లు ఆయ‌న్ని విల‌న్‌గా చూపెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నాయా? అంటే ఔన‌నే స‌మాధానం వినిపిస్తుంది. కొంద‌రు వ్య‌క్తులు కావాల‌ని ఆయ‌నపై బురద‌చ‌ల్లే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌నే విమ‌ర్శ‌లూ ఉన్నాయి. రెండు రోజుల క్రితం.. జూప‌ల్లి స‌త్య‌నారాయ‌ణ అనే వ్య‌క్తి భ‌వ్య ఆనంద్ ప్ర‌సాద్‌పై పెట్టిన కేసు వివ‌రాలు ఇలా ఉన్నాయి. 2017లో జూప‌ల్లి స‌త్య‌నారాయ‌ణ అనే వ్య‌క్తి భ‌వ్య ఆనంద్ ప్ర‌సాద్ ఆరంభించిన సిమెంట్ ప‌రిశ్ర‌మ‌లో కోటి రూపాయ‌ల పెట్టుబ‌డి పెట్టారు. ఆరు నెల‌ల‌కోసారి నాలుగు శాతం లాభ‌మిస్తార‌ని చెప్పిన‌ప్ప‌టికీ, గ‌త మూడేళ్ల నుంచి సొమ్ము చెల్లించ‌డం లేద‌ని.. అడిగితే చంపేస్తాన‌ని బెదిరించాడని పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో, వెంట‌నే రంగంలోకి దిగిన పోలీసులు ఆయ‌న కుటుంబ స‌భ్యుల్ని అరెస్టు చేశారు. భ‌వ్య ఆనంద్ ప్ర‌సాద్ ప‌రారీలో ఉన్నాడ‌ని ప‌లు మీడియా సంస్థ‌లు ప్ర‌చారం చేస్తున్నాయి.

* ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన విష‌యం ఏమిటంటే.. జూప‌ల్లి స‌త్య‌నారాయ‌ణ ఇచ్చింది కోటి రూపాయ‌లు. ఆరు నెల‌ల‌కోసారి నాలుగు శాతం ప్రాఫిట్ అంద‌జేస్తాన‌ని చెప్పార‌ని పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంటే, ఏడాదికి రూ.8 ల‌క్ష‌లు.. ఈ ఐదేళ్ల‌లో కోటి రూపాయ‌ల మీద రూ.40 ల‌క్ష‌ల దాకా చెల్లించాల్సి ఉంటుంది. ఒక‌వేళ తాను చెల్లించ‌లేక‌పోతే బాచుప‌ల్లి, బౌరంపేట్ వంటి ప్రాంతాల్లో ఉన్న భూముల్ని విక్ర‌యించి చెల్లిస్తానంటూ భ‌వ్య ఆనంద్ ప్ర‌సాద్ చెప్పార‌ని ఫిర్యాదుదారుడే స్వ‌యంగా పేర్కొన్నార‌ని పోలీసులు అంటున్నారు. ఇదే విష‌యం మీడియాలో కూడా ప్ర‌చారం అవుతోంది. అయితే, కోటీ న‌ల‌భై ల‌క్ష‌ల రూపాయ‌ల‌కు సంబంధించిన లావాదేవీ విష‌యంలో ఇంత రాద్దాంతం చేయ‌డం అవ‌స‌ర‌మా? అని భవ్య ఆనంద్ ప్ర‌సాద్ స‌న్నిహితులు అంటున్నారు. ఆయ‌న‌ థియేట‌ర్ల ఓన‌రు, నిర్మాత‌, బిల్డ‌ర్‌, సిమెంటు సంస్థ అధినేత‌గా అంద‌రికీ సుప‌రిచిత‌మేన‌ని.. కోటి రూపాయ‌ల్ని ఎగ్గొట్టేందుకు ఆయ‌న ఎక్క‌డికో పారిపోయాడ‌ని ప్ర‌చారం చేయ‌డం క‌రెక్టు కాదంటున్నారు. సామాన్య స్థితి నుంచి వంద‌లాది మందికి ఉపాధినిచ్చే స్థాయికి ఎదిగిన అత‌ని మీద ఇలా తెలిసీ తెలియ‌క అవాస్త‌వాలు ప్ర‌చారం చేయ‌డం క‌రెక్టు కాద‌ని చెబుతున్నారు. ఈ విష‌యంలో మీడియా వాస్త‌వాలు తెలుసుకుని వ్య‌వ‌హ‌రించాల‌ని హితువు ప‌లికారు. కేవ‌లం కోటి రూపాయ‌ల కోసం ప‌రార‌య్యాడ‌నే అస‌త్య ప్ర‌చారాలు మానుకోవాల‌ని సూచించారు. త‌ను అమెరికాలో మ‌న‌వ‌డ్ని చూడ‌టానికి కూక‌ట్ ప‌ల్లి కోర్టు అనుమ‌తి తీసుకుని  వెళ్లాడని స్ప‌ష్టం చేశారు. త‌ను హైద‌రాబాద్ తిరిగి రాగానే ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకుంటార‌ని అన్నారు. అప్ప‌టివ‌ర‌కూ మీడియా కాస్త ఓపిక ప‌ట్టాల‌ని కోరుతున్నారు.

Bavya Anand Prasad Case Updates

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here