షాకింగ్.. ఎంపీ సీఎం రమేష్ వాట్సాప్ ఎకౌంట్ తొలగించిన వాట్సాప్ సంస్థ

WHATS-APP COMPANY REMOVED MP RAMESH ACCOUNT

గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒక ఎంపీ వాట్సప్ ఎకౌంట్ వాట్సప్ సంస్థ తొలగించడం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సంచలనంగా మారింది. అయితే కేంద్రం దురుద్దేశంతోనే కుట్రపూరితంగా వాట్సప్ సంస్థ కు నిబంధనలు ఉల్లంఘించారని ఫిర్యాదు చేసి తన వాట్సాప్ ఎకౌంటు తొలగించేలా చేశారంటూ టీడీపీ అగ్రనేత రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మండిపడుతున్నారు. అయితే ఏ విధంగా నిబంధనలు ఉల్లంఘించానో , తన పైన అందిన ఫిర్యాదుల ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్న సీఎం రమేష్ వాట్సప్ సంస్థ కు లేఖ రాశారు.
టీడీపీ అగ్రనేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌‌కు చెందిన వాట్సాప్ అకౌంట్‌ను ఆ సంస్థ తొలగించింది. సంస్థ నిబంధనలు ఉల్లంఘించారని.. నిబంధనల ఉల్లంఘనలపై ఫిర్యాదులు అందాయని వాట్సాప్‌ సంస్థ ప్రతినిధులు తెలిపారు. దీనిపై వాట్సాప్ సంస్థకు సీఎం రమేష్ లేఖ రాశారు. అయితే దీని వెనుక కేంద్రం కుట్ర ఉన్నట్టుగా సీఎం రమేష్‌ అనుమానిస్తున్నారు. ఇక దీనిపై టీడీపీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లనున్నారు సీఎం రమేష్. ప్రస్తుత కాలంలో నిజజీవితంలో అత్యంత కీలకంగా మారిన వాట్సప్ తొలగించడంపై అటు సీఎం రమేష్ మాత్రమే కాదు టిడిపి శ్రేణులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనికి గల కారణాలను తెలుసుకోవాలని భావిస్తున్నాయి. వాట్సప్ సంస్థ సీఎం రమేష్ కు ఏ విధమైన సమాధానం ఇస్తుందో వేచి చూడాలి.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article