ధరణి సమస్యలా? వాట్సప్ చేయండి

తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. వినతులు పంపేందుకు వాట్సాప్‌, ఈ-మెయిల్‌ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, భూపరిపాలన చీఫ్‌ కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) సోమేశ్‌ కుమార్‌ తెలిపారు.‘‘వినతులు పంపాల్సిన వారు వాట్సాప్‌ నంబర్‌: 9133089444, Ascmro@Telangana.gov.in కు మెయిల్‌ చేయవచ్చు. త్వరితగతిన సమస్యలను పరిష్కరించేందుకు ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశాం. సీసీఎల్‌ఏ, రిజిస్ట్రేషన్లు, ఐటీ విభాగాల అధికారులను సభ్యులుగా నియమించాం’’ అని సీఎస్‌ వెల్లడించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article