వాట్సాప్ లో సరికొత్త ఫీచర్స్

104
Whatsapp New Feature
Whatsapp New Feature

వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు తీసుకొస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా మాయమయ్యే ఫొటోల ఫీచర్ తీసుకొచ్చింది. అంటే ఈ ఫొటోలను మనం ఎవరికైనా పంపామనుకోండి, వాళ్లు ఫొటో చూసిన తర్వాత చాట్ నుంచి బయటకు వచ్చారంటే ఇక అంతే.. ఆ ఫొటో ఇక కనిపించదన్నమాట. ‘వ్యూ వన్స్’ అనే ఈ ఫీచర్ తీసుకోస్తున్నట్లు గతంలోనే ప్రకటించిన వాట్సాప్.. తాజాగా బేటా టెస్టర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. త్వరలోనే అందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. WaBetaInfo షేర్ చేసిన ఫొటోల ప్రకారం, ఈ ఫీచర్ వాడటం కూడా చాలా తేలిక. మనం పంపాలనుకున్న ఫొటోలను మామూలుగానే గ్యాలరీ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. అయితే సెండ్ చేసే ముందు గడియారం బొమ్మపై క్లిక్ చేయాలంతే. ఒకసారి చూసిన తర్వాత ఈ ఫొటోలు మాయమైపోతాయి. ఈ వాట్సాప్ ఫీచర్.. ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించే ‘ఎక్స్‌పైరింగ్ మీడియా’ ఫీచర్‌లా ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here