ప్రభాస్ మరో భారీ సినిమా?

52
WHEN IS PRABHAS BIG MOVIE?
WHEN IS PRABHAS BIG MOVIE?

WHEN IS PRABHAS BIG MOVIE?

ప్రభాస్ ఇచ్చే షాకుల నుంచి ఫ్యాన్స్ తేరుకోవడం లేదు. అతను మాత్రం సర్ ప్రైజ్ లు ఇస్తూనే ఉన్నాడు. కొన్నాళ్ల క్రితం వరకూ కాస్త లేజీగా సినిమాలు చేసిన ఈ మోస్ట్ సీనియర్ బ్యాచులర్ ఈ మధ్య ఓ రేంజ్ స్పీడ్ తో సినిమాలు అనౌన్స్ చేస్తున్నాడు. సాహో తర్వాత మొదలైన రాధేశ్యామ్ పై పెద్దగా బజ్ రాలేదు. షూటింగ్ కూడా మందకొడిగా సాగుతోంది. అయితే అనూహ్యంగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వైజయంతీ బ్యానర్ లో సినిమా అనౌన్స్ చేశాడు. ఓ సైన్స్ ఫిక్షన్ సోషియో ఫాంటసీగా ఈ సినిమా ఉంటుందట. కోవిడ్ రాకుండా ఉంటే ఈ నవంబర్ లో ప్రారంభం అయ్యి ఉండేది. ఆ తర్వాత అనూహ్యంగా డైరెక్ట్ బాలీవుడ్ మూవీ ఆదిపురుష్ అనౌన్స్ చేశాడు. నిజంగా ఇది ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయని సినిమా. ఓమ్ రౌత్ డైరెక్షన్ లో మైథలాజికల్ ఫిక్షన్ గా ఈ మూవీ రాబోతోంది. వచ్చే జనవరిలో చిత్రీకరణ మొదలుపెట్టబోతున్నాడు దర్శకుడు ఓమ్ రౌత్.

ఈ టైమ్ లో ప్రభాస్ నుంచి మరో భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ కాబోతోందనే వార్త టాలీవుడ్ ను సైతం ఆశ్చర్య పరుస్తోంది. కన్నడలో రెండు సినిమాలతోనే ప్యాన్ ఇండియన్ ఇమేజ్ సొంతం చేసుకున్న ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ప్రభాస్ సినిమా చేయబోతున్నాడు. యస్.. ఈ వార్త కొన్నాళ్లుగా వినిసిస్తోన్నా.. ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్, మహేష్ అంటూ పేర్లు వినిపించాయి. కానీ సడెన్ గా సీన్ లోకి ప్రభాస్ వచ్చాడు. ప్రశాంత్ ఫస్ట్ మూవీ ఉగ్రమ్ కన్నడలో సూపర్ హిట్ అయింది. కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీ లైన్ ఆధారంగానే ప్రభాస్ కూ కథ రాశాడట.

ఆ కథ బాగా నచ్చడంతో ప్రభాస్ ఇమ్మీడియొట్ గా యస్ చెప్పాడు. మైత్రీ మూవీస్ బ్యానర్ లో రూపొందే ఈ ప్రాజెక్ట్ త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ కాబోతోంది. నిజానికి ఉగ్రమ్ సినిమా వచ్చినప్పుడే అది ప్రభాస్ కు బాగా సూట్ అవుతుందన్న వార్తలు వచ్చాయి. ఎందుకో అప్పుడు వర్కవుట్ కాలేదు. ఫైనల్ గా అదే పాయింట్ తో కొత్త సినిమా రాబోతోంది. ఇక మరో షాకింగ్ మేటర్ ఏంటంటే.. రాధేశ్యామ్ తర్వాత ఈ సినిమానే ఉండబోతోంది. యస్.. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఈ మాస్ ఎంటర్టైనర్ నే ముందుగా ఫినిష్ చేయాలనుకుంటున్నాడట ప్రభాస్. కెజీఎఫ్ తో ప్రశాంత్ నీల్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఇప్పుడు దానికి సీక్వెల్ తో రాబోతోన్నాడు. వచ్చే సంక్రాంతికి కెజీఎఫ్ చాప్టర్ 2 విడుదలవుతుంది. ఆ తర్వాత వెంటనే ప్రభాస్ తో సినిమా మొదలవుతుందట. అంటే ప్రభాస్ ఏకకాలంలో రాధేశ్యామ్, ఆదిపురుష్ తో పాటు ప్రశాంత్ నీల్ సినిమాలనూ చేస్తాడన్నమాట. ఏదేమైనా ప్రభాస్ దూకుడు నిజంగానే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here