ఆర్ఆర్ఆర్.. అప్రిసియేషన్ ఎప్పుడు?

If you can wait for minimum ten years and maximum twenty years, than only you invest @ regional ring road area nearby locations. Don't believe real estate agents words and invest your hard earned money. So, be careful while investing.

132

ఇక్కడ్నుంచే రీజినల్ రింగ్ రోడ్డు వెళుతోంది సార్..
ఆర్ఆర్ఆర్ పక్కనే మాది వంద ఎకరాల వెంచర్ మేడం..
ఆర్ఆర్ఆర్ పనులూ స్టార్ట్ అయితే ధర పెరగడం పక్కా..
ఇప్పుడు కొంటేనే ఫ్యూచర్లో అప్రిసియేషన్ ఉంటుంది..

రియల్ సంస్థలు, ఏజెంట్లను కదలిస్తే చాలు.. ఈమధ్య కాలంలో ఇలాంటి మాటలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. నగరంలోని అనేక రియల్ సంస్థలు ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ ని చూపెట్టి మధ్యతరగతి ప్రజల్ని మభ్యపెట్టడం ఆరంభించారు. ఇప్పుడు కొనకపోతే భవిష్యత్తులో కొనలేరంటూ.. రేట్లు పెరుగుతాయంటూ ఆశ పెడుతున్నారు. అవి నిజమేనని నమ్మితే మీ సొమ్ము కాస్త బూడిదలో పన్నీరుగా మారుతుంది. ప్రస్తుతం ప్లాటు కొని.. కనీసం ఓ ఇరవై ఏళ్లు వేచి చూడగలమన్న ఓపిక ఉన్నవాళ్లు మాత్రమే ఇలాంటి మాటల్ని నమ్మితే కొంతలో కొంత నయం.

శాటిలైట్ టౌన్ షిప్పులా?
రీజినల్ రింగ్ రోడ్డు పూర్తయితే తెలంగాణ రాష్ట్రానికే ప్రధాన ఆకర్షణగా మారుతుందనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే, ప్రభుత్వం ప్రకటించినట్లు ఇందులో శాటిలైట్ టౌన్ షిప్పులు వంటివి ఏర్పాటు అవుతాయనే మాటల్ని మాత్రం నమ్మకండి. ఎందుకంటే, ఔటర్ రింగ్ రోడ్డు ఆరంభంలో ఇలాగే ఆనాటి ప్రభుత్వం శాటిలైట్ టౌన్ షిప్పులు ఏర్పడతాయని ప్రకటించింది. ఇప్పటికీ దాదాపు పదహారేళ్లు దాటినా వాటి ఊసే లేదు. మధ్యలో ప్రభుత్వాలు శాటిలైట్ టౌన్ షిప్పుల జీవోలను మార్చుతూ వచ్చింది తప్ప.. ఇవి ఏర్పాటయ్యేందుకు ఎదురయ్యే వాస్తవిక సమస్యల్ని పరిష్కరించేందుకు ముందుకు రాలేదు. ఓఆర్ఆర్ శాటిలైట్ టౌన్ షిప్పుల పరిస్థితి ఇలాగుంటే, రీజినల్ రింగ్ రోడ్డు చుట్టూ డెవలప్ అయ్యేందుకు ఇంకెంత సమయం పడుతుందో ఆలోచించాలి.

భూసేకరణకు ప్రణాళికలున్నాయా?
రీజినల్ రింగ్ రోడ్డు చుట్టూ పారిశ్రామిక వాడలు, ఐటీ సెంటర్లు, లాజిస్టిక్ పార్కులు, ఫార్మా పరిశ్రమలు, రిక్రియేషన్ సదుపాయాలు, వాణిజ్య కట్టడాలు, షాపింగ్ మాళ్లు, మల్టీప్లెక్సులు వంటివి వాస్తవం కావడానికి ఇంకెంత కాలం అవుతుందో ఒక్కసారి ఆలోచించాలి. ప్రభుత్వం ప్రకటనల పుణ్యమా అంటూ రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఇష్టం వచ్చినట్లు ధరల్ని
కృత్రిమంగా పెంచేస్తున్నారు. దీంతో, భూసేకరణ జరపడం ఎంత కష్టంగా మారుతుందనే విషయాన్ని ప్రతిఒక్కరూ గుర్తించాలి. అమరావతి రాజధాని కట్టేందుకు గత ప్రభుత్వం ఎలాగైతే భూసేకరణ జరిపిందో.. అదిగో ఆ తరహాలో చిత్తశుద్ధితో చేపట్టాల్సి ఉంటుంది. పైగా ప్రజలు కూడా స్వచ్ఛంధంగా తమ భూముల్ని ఇచ్చేందుకు ముందుకొస్తేనే సాధ్యమవుతుంది. ఎప్పుడో పదేళ్ల క్రితం హెచ్ఎండీఏ చేపట్టిన ఉప్పల్ భగాయత్ భూసేకరణలో కేటాయించిన ప్లాట్లకు సంబంధించిన ఇప్పటికీ కొన్ని కేసులు కోర్టులో కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ సంస్థలకు భూసేకరణ పనిని అప్పగిస్తే ఇదిగో ఇలాంటి నిర్వాకమే చేస్తారు.

340 కి.మీ.. 20 వేల కోట్లు..
340 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్డు.. పూర్తయ్యేసరికి ఇరవై వేల కోట్లు అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇందులో యాభై శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భూసేకరణ నిమిత్తం భరిస్తుంది. రీజినల్ రింగ్ రోడ్డు ఏర్పాటైతే తెలంగాణ రాష్ట్రంలోని 24 పట్టణ ప్రాంతాలు, 200 గ్రామాలకు అనుసంధానం ఏర్పడుతుంది.

  • పుణె నుంచి మచిలిపట్నం రహదారి అయిన ఎన్ హెచ్ 65ని అనుసంధానం చేస్తుంది.
  • సంగారెడ్డి, నాందెడ్, అకోలా వంటి ప్రాంతాలకు కనెక్టివిటీ పెరుగుతుంది.
  • హైదరాబాద్ నుంచి మెదక్ ఎన్ హెచ్ 7650కి కనెక్టివిటీ
  • రాష్ట్ర రహదారి అయిన హైదరాబాద్ రామగుండం, మరో రహదారి అయిన హైదరాబాద్- భూపాలపట్నంకు కనెక్టివిటీ పెరుగుతుంది.
  • తూర్పులోని 158 కిలోమీటర్ల విస్తీర్ణంలో.. గజ్వేల్, సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, యాదాద్రి, ప్రగ్నాపూర్, భువనగిరి, చౌటుప్పల్ లను కలుపుతుంది.
  • 182 కిలోమీటర్ల మేరకు చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం, కందుకూరు, ఆమన్ గల్, చేవేళ్ల, శంకర్ పల్లి, సంగారెడ్డిలను అనుసంధానం చేస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here