మంత్రులే పాటించకపోతే ఎలా?

Where Is Social Distance?

కనీసం ఐదు అడుగుల సామాజిక దూరం పాటించాలని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల మార్గదర్శకాల్ని విడుదల చేసింది. కానీ, అదేమిటో కానీ సాక్షాత్తు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. ఇలా వీరెవరూ వీటిని పాటించడం లేదని ఈ చిత్రాల్ని చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. కేసీఆర్ పిలుపును అందుకున్న ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపడటానికి వీరంతా రోడ్ల మీద వచ్చినందుకు ఎవరూ తప్పు పట్టనే పట్టరు. కాకపోతే, ప్రజలకు మార్గదర్శకులుగా నిలవాల్సిన వీరే.. కనీసం ఐదు అడుగుల సామాజిక దూరాన్ని పాటిస్తే తెలంగాణ సమాజానికి మేలు చేసినవారు అయ్యేవారు. కానీ, రెండు రోజుల్నుంచి ఏం జరుగుతుంది?

అధిక శాతం మంది ప్రజాప్రతినిధులు ఐదు మీటర్ల సామాజిక దూరాన్ని అస్సలు పాటించుకోవడం లేదు. మిగతా రోజుల్లో ఎలాగూ పత్రికల్లో ఫోటోలు వస్తాయి.. ప్రచారంలో ముందుండొచ్చు. కానీ, కరోనా వైరస్ వల్ల ప్రపంచమంతా అల్లకల్లోలం అవుతుంటే.. అమెరికా, స్పెయిన్, ఇటలీ వంటి డెవలప్డ్ కంట్రీలే ఏం చేయాలో అర్థం కాకుండా తలపట్టుకుంటుంటే.. మన ప్రజాప్రతినిధులు మాత్రం నేటికీ పత్రికల్లో ఫోటోల కోసం ఫోజులివ్వడం చూస్తే ఎవరికైనా నవ్వు రాక మానదు. ఒకట్రెండు నెలలు ఫోటోలకు ఫోజులు ఇవ్వకుండా, ప్రజల్ల ఆత్మస్థయిర్యాన్ని నింపే పని చేసి, ఈ గండం నుంచి గట్టెక్కితే.. ప్రతి ప్రజాప్రతినిధులు రానున్న రోజుల్లో సంతోషంగా నివసించొచ్చు. కానీ, సామాజిక దూరం పాటించకపోవడం వల్ల అమెరికా, స్పెయన్, ఇటలీ, దక్షిణ కొరియా తరహా పరిస్థితులు మన వద్ద తలెత్తితే.. మన ప్రజలు పిట్టల్లా రాలిపోయే ప్రమాదముంది. అలా కాకుండా ఉండాలంటే, మంత్రులైనా మరొకరు అయినా సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాల్సిందే.

 

Where Is Social Distance Minsters?

Minister Gangula Kamalakar..

where is social distancing?
where is social distancing Mr Minister?
Here Is A MLC Not Maintaining Social Distance?
MLC Not Maintaining Social Distance?
Even Home Minister Doesn't Know
Even Home Minister Doesn’t Know About This

MLA Doesn’t Know Social Distance

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *