white ration card-holders bought land worth Rs 220 crore in Amaravati
మూడు రాజధానుల అంశం ఎలా ఉన్నా..ప్రస్తుతం అమరావతి భూముల కొనుగోలు అంశం తెరపైకి వచ్చింది. ల్యాండ్ పూలింగ్ నే భాగంగా అమరావతి భూములు కొనుగోలు చేసింది గత ప్రభుత్వం టీడీపీ. అయితే అందులో లొసుగులున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు అమరావతి భూముల కొనుగోలుపై కేసు నమోదు చేసింది సీఐడీ. 796 తెల్లరేషన్‌కార్డు హోల్డర్స్‌పై కేసు నమోదు చేసిన సీఐడీ. అసలు షాకింగ్ ఏంటంటే.. రూ.3 కోట్లకు చొప్పున ఎకరం భూమి కొనుగోలు తెల్లరేషన్‌కార్డు హోల్డర్స్ కొనుగోలు చేయ్యడం. అది సాథ్యమేనా? తెల్ల రేషన్ కార్టుదారులు ఎకరాకు మూడు కోట్లు ఎలా పెట్టగలుగుతారు? ఈ నేపథ్యంలో మొత్తం రూ.300 కోట్లతో భూమి కొనుగోలు చేసినట్లు గుర్తించింది. అయితే అసలు తెల్లరేషన్ కార్డు హోల్డర్స్‌తో కొనుగోలు చేయించిన వారెవరన్న దానిపై ఆరా తీస్తుంది సిఐడి. అందుకు గానూ విచారణ కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేసిన సీఐడీ. మొత్తం 129 ఎకరాలు 131 మంది తెల్లరేషన్ కార్డు హోల్డర్స్ కొన్నట్లు తెలిసింది. పెద్దకాకానిలో 40 ఎకరాలు కొన్న 43 మంది, తాడికొండలో 180 ఎకరాలు కొన్న 188 మంది, తుళ్లూరులో 243 ఎకరాలు కొన్న 238 మంది, మంగళగిరిలో 133 ఎకరాలు కొన్న 148 మంది, తాడేపల్లిలో 24 ఎకరాలు కొన్న 49 మంది తెల్లరేషన్ కార్డు హోల్డర్స్ బయటపట్టారు. దీనిపై సిఐడీ సీరియస్ గా విచారణ చేపట్టింది.