పార్లమెంటులోకి కత్తితో వెళ్లాడెందుకు?

Who Entered Parliament With Knife?

పార్లమెంట్ వద్ద ఊహించని ఘటన జరిగింది. ఓ వ్యక్తి పార్లమెంట్ లోకి కత్తితో వెళ్ళే యత్నం చేశారు. ఢిల్లీలోని పార్లమెంట్ వద్ద సోమవారం (సెప్టెంబర్ 2)  ఉదయం కలకలం రేగింది. ఓ వ్యక్తి కత్తితో పార్లమెంట్‌ ఆవరణలోకి ప్రవేశించేందుకు యత్నించగా సెక్యూరిటీ సిబ్బంది అతడిని పట్టుకున్నారు. బైక్‌పై వచ్చిన అతను విజయ్ చౌక్ గేట్ నుంచి పార్లమెంట్‌ లోపలికి ఎంటరయ్యేందుకు యత్నించాడు. అయితే సెక్యూరిటీ సిబ్బంది అతడిని నిలువరించి.. తనిఖీ చేయగా ఓ కత్తి దొరికింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో..  వారు అతడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.  ఇతను ఎవరు..? కత్తితో పార్లమెంట్ ఆవరణలోకి ఎందుకు ప్రవేశించాలనుకున్నాడనే దానిపై ఆరా తీస్తున్నారు. పార్లమెంట్ సమావేశాలు జరుగకపోయినా అతను ఎందుకు వెళ్లటానికి ప్రయత్నించాడు అని  పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

tags: Delhi Parliament, knife, a person, police arrest

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article