ఎవ‌డీ జ‌గ్గారెడ్డి? వైఎస్ ష‌ర్మిల‌ ఆగ్ర‌హం

WHO IS JAGGAREDDY? YS SHARMILA FIRED

ఎమ్మెల్యే జగ్గారెడ్డి పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ ష‌ర్మిల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి త‌న‌ను బెదిరించాడ‌ని మ‌రోసారి మాట్లాడితే బాగోద‌న్నారు. ”జ‌గ్గారెడ్డి
నీ ఛాలెంజ్ కి భయపడేది కాదు ఈ వైఎస్ఆర్ బిడ్డ” అని ఆమె మండిప‌డ్డారు.
జగ్గారెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నార‌ని వైఎస్ షర్మిల విమ‌ర్శించారు. వైఎస్సార్ చనిపోయిన రోజు ఆయన పరామర్శకు వ‌స్తే తాము రాజ‌కీయాలు మాట్లాడ‌మ‌ని అన‌డం ప‌చ్చి అబ‌ద్ధమ‌ని కొట్టిపారేశారు. ఆరోజు త‌మ కుటుంబం పడిన బాధ త‌మ‌కే తెలుస‌న్నారు. చెట్టంత మనిషి కోల్పోయి తాముంటే.. మా తలకాయ కోల్పోయినంత బాధ‌ప‌డ్డామ‌ని విచారం వ్యక్తం చేశారు. అసలు తాము బ్రతుకుతామా.. చ‌స్తామా.. అన్నంత బాధ‌లో ఉన్న మా గురించి జ‌గ్గారెడ్డికేం తెలుస‌ని ఆమె మండిపడ్డారు. అసలు ఎవడీ జగ్గారెడ్డి.. ఛాలెంజ్ చేయడానికి ఎవడు?
”పాలమూరు ఎమ్మెల్యేలంతా కలిసి స్పీకర్ కి ఫిర్యాదు చేస్తేనే భయపడలేదు.. ఒక మంత్రి త‌న మీద ఎఫ్ఐఆర్ న‌మోదు చేస్తే భ‌య‌ప‌డ‌లేదు.. ఈ రాజశేఖర్ బిడ్డ.. ఎవడికి భయపడేది కాదు.. దమ్ముంటే తన‌ను అరెస్ట్ చేయండి” అని వైఎస్ ష‌ర్మిల సవాల్ విసిరారు. ఇక్కడ ఉన్నది వైఎస్సార్ రక్తం.. పులి బిడ్డ. ఇక్కడున్నది వైఎస్సార్ ఊపిరి.. వైఎస్సార్ ప్రాణం జగ్గారెడ్డికి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు.
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article