విడుదల తర్వాతా కొట్టుకుంటోన్న స్టార్స్

Who Is Sankranthi Winner
సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో.. విడుదలకు ముందు ఈ రెండు సినిమాల మధ్య ఎంత పోటీ ఉందో అందరికీ తెలుసు.. పాటల నుంచి వైకుంఠపురము టాప్ అనిపించుకుంటే ఆ తర్వాత పోటీ పడి మరీ ప్రతి మండే పాట అంటూ మహేష్ కూడా హడావిడీ చేశాడు. మొత్తంగా రిలీజ్ డేట్ విషయంలో కూడా ఈ రెండు సినిమాల మధ్య గట్టి క్లాష్ ఏర్పడింది. దీంతో పరిశ్రమ పెద్దలు తలదూర్చి సద్దుమణిగేలా చేశారు. ఏదైతేనేం ముందు చెప్పిన టైమ్ లోనే రెండు సినిమాలూ విడుదలయ్యాయి. మహేష్ బాబు సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్నారు. ఇటు వైకుంఠపురమును కూడా సంక్రాంతి హిట్ అనేస్తున్నారు. అయితే మళ్లీ మరోసారి ఈ రెండు సినిమాల మధ్య వార్ మొదలైంది. అదేంటో తెలుసా.. అసలు సంక్రాతి విన్నర్ ఎవరూ అని.
ఫస్ట్ డే తర్వాత సరిలేరు నీకెవ్వరు సినిమాకు ‘నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ బ్లాక్ బస్టర్’ అనే ట్యాగ్ తో ప్రమోషన్ మొదలుపెట్టారు. ఇక ఇప్పుడు వైకుంఠపురము టీమ్ మాత్రం ఏకంగా ‘సంక్రాంతి విన్నర్’ అంటూ పేద్ద వినైల్ పోస్టర్స్ కొట్టించి మరీ సక్సెస్ మీట్ మొదలుపెట్టారు. దీంతో ఈ రెండు సినిమాల మధ్య గొడవ సద్దుమణగలేదు అనుకుంటున్నారు. అవన్నీ అటుంచితే.. మామూలు టైమ్ లో వచ్చి ఉంటే ఈ రెండు సినిమాల్లోనూ అనుకున్నంత పస లేదని ఎవరికైనా తెలుస్తుంది. ఏదో పండగ సందర్భంగా వచ్చిన శెలవులను క్యాష్ చేసుకోవడం తప్ప పెద్ద కంటెంట్ లేని వీళ్లే ఇట్టా కొట్టుకుంటే.. ఇంక మంచి కథ కూడా ఉండి ఉంటే నిజంగా వార్ ఓ రేంజ్ లో ఉండేదేమో..

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article