* కేవలం కేటీఆర్‌ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?
* కేసీఆర్ కుమార్తె కవితపై ఫోకస్ ఎందుకు?
* నిన్నటి బలమే కేసీఆర్‌కు బలహీనమైందా?
* హరీష్ రావును బీజేపీ ఎలా వాడుకునే వీలుంది?
బీజేపీ అధినాయకత్వం కేవలం కేసీఆర్, కేటీఆర్, కవితలను టార్గెట్ చేస్తున్నారే తప్ప ఆర్థికమంత్రి హరీష్ రావును ఎక్కడా టచ్ చేయట్లేదు. అసలు ఆయన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు. ఒక ప్రణాళికాబద్ధంగా బీజేపీ పెద్దలు తెలంగాణలో పావులు కదుపుతున్నారనే విషయం ఇప్పటికైనా అధికార పార్టీకి అర్థమయ్యే ఉంటుంది. కేటీఆర్‌కు అత్యంత సన్నిహితులైన సంస్థల మీద ఐటీ దాడుల్ని జరిపిస్తూ.. వారి ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడుతున్నారు. ఈ క్రమంలో వాసవి, ఫినీక్స్‌ల మీద పడ్డారు. తర్వాత ఎవరి మీద పడతారోనని రియల్ రంగం ఆత్రుతగా ఎదురు చూస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ కవిత పేరును బయటపెట్టారు. గతంలో ఎంపీగా ఉన్నప్పుడు కవిత ఢిల్లీలో కూర్చుని ఈ లిక్కర్ వ్యాపారంలో భాగమయ్యారని బీజేపీ ఆరోపించింది. లిక్కర్ స్కామ్‌లో వచ్చిన సొమ్మును ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్, గోవా ఎన్నికల్లో వినియోగించారని.. బీజేపీ మాజీ ఎమ్మెల్యే మన్‌జిందర్ సింగ్ సార్సా విలేకరుల సమావేశంలో వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే, కవిత మాత్రం ఈ ఆరోపణల్ని కొట్టిపారేస్తూ, ఆరోపణల్ని చేసిన వారి మీద పరువు నష్ట దావాను వేస్తానని హెచ్చరించారు.
* నిన్నటివరకూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అండదండగా ఉంటూ.. బలమైన శక్తిలా కనిపించిన కేటీఆర్, కవితలే.. నేడు బలహీనమయ్యారు. ఇక మున్ముందు తెలంగాణలో అధికార పార్టీ మీద బీజేపీ ఎలాంటి అస్త్రాల్ని సంధిస్తుందేమోనని ప్రజలు అనుకుంటున్నారు. బీజేపీ పని గట్టుకుని కేటీఆర్, కవితలను టార్గెట్ చేస్తున్నారనే విషయం తెలంగాణ ప్రజలకు పూర్తిగా అర్థమైంది. మరి, బీజేపీ కుయుక్తులను అధికార పార్టీ ఏమేరకు అడ్డుకుంటుందనే విషయం తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.