కోర్టులో కేసీఆర్ ఎందుకు తల దించుకున్నాడు?

WHY CM KCR PUT HEAD DOWN IN COURT?

పురపాలక చట్టం లో ప్రతి అక్షరాన్ని నేనే రాసిన అని అసెంబ్లీ లో గొప్పగా చెప్పుకున్న సీఎం కేసీఆర్.. ఎన్నికలకు సంబంధించి కోర్టు లో ఎందుకు తల దించుకోవాల్సి వచ్చింది? కొత్త చట్టం కాదు.. తూచ్.. అంతా పాత చట్టం ప్రకారమే ఎన్నికలను నిర్వహిస్తామని ఎందుకు సంజాయిషీ ఇచ్చు కోవాల్సి వచ్చింది? నిబంధనల ప్రకారమే అంత చేసి ఉంటే మునిసిపల్ ఎలక్షన్స్ కు సంబంధించి కోర్టులో ఇన్ని కేసులు పడేవా? బుర్ర ఉన్నవాళ్లును కాదని బుర్రలు ఊపే వారిని పెట్టుకుంటే పురపాలక చట్టం పురిటి లోనే పోయే ప్రమాదం ఏర్పడటం దారుణమైన విషయం.

నిజానికి కొత్త మునిసిపల్ చట్టం లో ఒక్క విషయం తప్ప కొత్తదనమేమి లేదు.  100 ల పేజీలు ఏమిటి ఒక్క పేజీలో గందరగోళం, గత్తర లేని చట్టం తెస్తామని చెప్పి చేసింది మాత్రం ఆ 100 పేజీలకు ఇంకొక్క పేజీని (చట్టవ్యతిరేకమైన) కలిపి చేసినవే కొత్త చట్టాలు. ఉదాహరణకు పంచాయితీ రాజ్ మరియు పురపాలక చట్టాల్లో చేర్చిన పేజీ ఏమిటంటే..ఉప సర్పంచ్లకు చెక్ పవర్, 85% మొక్కలు బతకాలని లేకుంటే అధికారులైనా, ప్రజాప్రతినిధులు అయినా వారి పదవులు వదులుకోవాలి అనే నిబంధన తప్ప. మహా అయితే  కవర్ పేజీ. వినపడేవి ఏవి కనపడవు. పునర్నిర్మాణం అంటే పాత పుస్తకానికి కొత్త అట్ట వేయటం, పాత గోడలు కూల్చి కొత్త గోడలు కట్టడమా?. ఆలోచన మంచిదే అక్షర రూపం ఇవ్వడంలో అహంకారం కనపడుతుంది. ఆచరణలో అవినీతి బయటపడుతోంది. ఉదాహరణకు కొత్త పాస్ బుక్స్ నే తీసుకుంటే సమస్యను సృష్టించి పరిష్కారం చూపుతున్నట్లు నాటకం. నిజంగా రైతులకు పెట్టుబడి సాయం చేయాలని అనుకుంటే పాత పాస్ బుక్స్ తో ఇస్తే తప్పేంటి?  ఇక్కడే అపరిచితుడు ఉన్నాడు. మాభూమి వెబ్సైట్ బదులుగా కొత్త వెబ్సైట్ కావాలి అందుకే కొత్త పాస్ పుస్తకాలు. మా భూమి వెబ్సైట్ కంటే కొత్తగా  రికార్డ్స్ ప్రక్షాళన చేసింది ఏముంది? ధరణి వెబ్సైట్ ఇప్పటి కి ఎందుకు అందుబాటులో కి రాలేదు. తప్పు ఎవరిది. అంతా నాకే తెలుసు అనుకుంటే తప్పే మీ  లేదు కానీ, మిగతా ఎవ్వరికీ యేమి తెలియదు అనుకోవడంమే ముప్పు.

* భూ రికార్డుల ప్రక్షాళన జరగక పోగా కొత్త పంచాయితీ / గొడవలు మొదలైనవి. వాటిని పరిష్కరించాల్సిన యంత్రాంగానికి వెబ్సైట్ అందుబాటులో లేదు. సవరణలు వీలుకాక పోవడం వెబ్సైట్ లో భూమి వివరాలు చూసుకునే అవకాశం లేకపోవడం తో రైతులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. తన తప్పును ఒక చిన్న గుమస్తా వేసి తప్పిచ్చు కొనే  ప్రయత్నం.  ఆ అవినీతి నిజమే కానీ పరిష్కరించవలసిన 5 సంవత్సరాలుగా ఎందుకు యేమి చేయలేకపోయారు. ఇప్పుడు తేవాల్సింది కొత్త చట్టం కాదు ఉన్నవాటిని అందుబాటులోకి.  ముందు ప్రభుత్వ వ్యవస్థలను పని చేయనివ్వాలి. అన్ని GO లో ప్రజలకు అందుబాటులో పెట్టాలి. ఈ ఒక్కటి చేస్తే సగం అవినీతి అడ్డుకోవచ్చు.

TELANGANA GOVERNMENT MISTAKES

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *