ద‌ళితులంటే సారుకు ఎందుకంత ప్రేమ‌?

156
why CM KCR Showing love towards Sc St
why CM KCR Showing love towards Sc St

హుజురాబాద్ ఎన్నిక‌ల మ‌హ‌త్య‌మో.. మ‌రేంటో కానీ.. ఈమ‌ధ్య రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు ద‌ళితులంటే ఎక్క‌డ్లేని ప్రేమ పుట్టుకొస్తుంది. దేశంలోనే అతిపెద్ద అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేసే విష‌యం మ‌ర్చిపోయారు.. ద‌ళితుల‌కు మూడెక‌రాల భూమినివ్వ‌డం మ‌ర్చిపోయారు.. రాజ్యాంగం ప్ర‌కారం ఎస్సీఎస్టీల అభివృద్ధి కోసం ఖ‌ర్చు చేయాల్సిన నిధుల గురించి ఎప్పుడూ మాట్లాడ‌లేదు. అదేంటో కానీ, ఈమ‌ధ్య ద‌ళితులంటే ఎక్క‌డ్లేని ప్రేమ, వాత్స‌ల్యం ప్ర‌ద‌ర్శిస్తున్నారు. రాత్రికి రాత్రే ద‌ళితుల్ని రిచ్‌ చేద్దామ‌నే ఉద్దేశ్యంతో ద‌ళిత‌బంధు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. తాజాగా, మనిషి చంద్రుని మీదకు వెళ్లినా- దళితులు కఠిన పేదరికంలో ఉండటం మంచిది కాదని సీఎం కేసీఆర్ హితువు ప‌లికారు. ఎంత మంచి మాట‌.. ఎంత చ‌క్క‌ని మాట‌.. మ‌రి, ఆయ‌న గ‌త ఏడేళ్ల నుంచి ద‌ళితుల అభివృద్ధి కోసం ఏమేం ప‌నులు చేశారో వివ‌రించాల‌ని తెలంగాణ ప్ర‌జానీకం కోరుతున్న‌ది. ఎస్సీ, ఎస్టీ నిధుల్ని ఇత‌ర అవ‌స‌రాల నిమిత్తం వినియోగించిన ఘ‌న‌త టీఆర్ఎస్ ప్ర‌భుత్వానికే ద‌క్కుతుంద‌ని సాక్షాత్తు ఐఏఎస్ అధికారులే అంటున్నారు. ఇప్ప‌టికైనా ఓటు రాజ‌కీయాలు మానుకుని నిజ‌మైన నిరుపేద‌ల అభివృద్ధి కోసం ప‌ని చేయాల‌ని ప్ర‌జ‌లు కోరుతున్నారు.

  • 24 గంటల కరెంట్ విషయంలో జానారెడ్డి తో అసెంబ్లీలో సవాల్ చేసినా.. 24గంటల కరెంటు ఇస్తా అంటే జానారెడ్డి నమ్మలేదు.. ఒక‌వేళ అమ‌లైతే టీఆరెస్ కండువా కప్పుకుంటా అని జానారెడ్డి అసెంబ్లీలో అన్నారు.. కానీ, మాట తప్పి మొన్న నాగార్జున సాగర్ లో పోటీ చేశార‌ని కేసీఆర్ ఎద్దేవా చేశారు. చిల్లర అరుపులను పట్టించుకోకుండా అభివృద్ధి కోసం మేము ముందుకు సాగుతున్నామ‌ని తెలిపారు. ఏనుగు పోతుంటే చిన్న చిన్న జంతువులు అరుస్తుంటే అవి పట్టించుకోవు.. అదే త‌ర‌హాలో తాము చిల్లర అరుపులను పట్టించుకోమ‌ని తెలిపారు. తెలంగాణ సంపదను పెంచేందుకు మేము ప్రణాళికలు- పథకాలు తెస్తున్నామని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here