Why Jagan DID INT Attend AKILAPAKSHA BETI
ఏపీలో రాజకీయం రానున్న ఎన్నికల నేపధ్యంలో వేడెక్కింది. ఏ చిన్న అవకాశం దొరికినా ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేస్తున్నాయి ఎపీలోని రాజకీయ పార్టీలు. ఏపీకి కేంద్రం చేసిన అన్యాయం మీద, ప్రత్యేక హోదా హామీ ఇచ్చి మోసం చేయడం మీద, విభజన హామీలను అమలు చేయకుండా కేంద్రం చూపిస్తున్న వివక్ష మీద, అలాగే ఏపీకి రావాల్సిన నిధులు విషయంలో జరుగుతున్న అన్యాయం పైన అన్ని పార్టీలు ఏకతాటి మీదకు వచ్చి కేంద్రంపై సమర శంఖం పూరించాలి భావించాయి. అందులో భాగంగా ఉండవల్లి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ భేటీలో వైసిపి మినహా మిగతా అన్ని పార్టీలు బీజేపీతో సహా పాల్గొన్నాయి. అంతేకాదు మేధావులు, విద్యావంతులు సైతం అఖిలపక్ష భేటీలో పాల్గొన్నారు. కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడానికి పార్టీలకతీతంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు. సమావేశంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఏపీ కి జరిగిన అన్యాయం పైన ఎవరు నోరు మెదపకుండా ఉంటే సమస్య పరిష్కారం కాదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా చెంప మీద కొడితే కనీసం పౌరుషం ఉండాలా వద్దా అంటూ ఆయన ఏపీ కి జరిగిన అన్యాయం పై ఏ పార్టీ పోరాటం చేసిన వారితో కలిసి సాగేందుకు రెడీగా ఉన్నానని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
అఖిలపక్ష భేటీలో పాల్గొనని వైసిపి, టిడిపి, జనసేన లతో కలిసి వేదిక పంచుకోవడం ఇష్టం లేకనే పాల్గొనలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు వైసీపీ అధినేత జగన్ తీరుపై మండిపడ్డారు. అఖిలపక్ష భేటీలో పాల్గొనకుండా జగన్ చెప్పిన సమాధానం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన చంద్రబాబు జైల్లో కూర్చుంటారు కానీ అఖిలపక్ష భేటీలో కూర్చోరా అంటూ ఫైర్ అయ్యారు. గత 16 ఏళ్లలో తనపై కన్నా లక్ష్మీనారాయణ మూడు పిటిషన్లు వేశారని, ఇక వైయస్ రాజశేఖర్ రెడ్డి 13, అనుచరులతో 12 కేసులు వేయించారని చంద్రబాబు పేర్కొన్నారు. ఇక జగన్ తన తల్లితో 2464 పేజీల బిల్లు వేయించారని అన్నిటినీ కోర్టులు కొట్టి వేశాయని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రం కోసం జరిగిన అఖిలపక్ష భేటీలో జగన్ పాల్గొనకపోవడం రాష్ట్రం పట్ల ఆయనకున్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. బీజేపీ తో కుమ్మక్కై జగన్ పార్టీ పని చేస్తున్నందువల్ల అఖిలపక్ష భేటీలో పాల్గొనలేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.