ఆర్థికమాంద్యంలో కొత్త సచివాలయం ఎందుకు?

98
Why New Secretariat In Recession
Why New Secretariat In Recession

Why New Secretariat In Recession?

పంచాయితీ రాజ్ చట్టం, పురపాలక చట్టాలు అంటూ తెగ హడావిడి చేసి, అసమగ్ర మునిసిపల్ చట్టం తీసుకొచ్చి రాజ్ భవన్ లో తాకుడు రాయి తగిలితే కోర్టు మెట్ల మీద బొక్క బోర్లా పడిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ కొత్త రాగం అందుకున్నది. అదే, ఎప్పటిలాగే గ్రామ స్వరాజ్యం అంటూ మొదలెట్టింది. సుమారు ఆరు నెలల్నుంచి పంచాయతీలకు జీతాలివ్వకుండా సర్పంచ్ కు, ఉప సర్పంచ్ కు పంచాయతీ పెట్టి తగుదునమ్మా అని మళ్ళీ కొత్త నాటకాన్ని అందుకున్నదా అనిపిస్తుంది. ఏంటో ప్రభుత్వ ప్రాధాన్యతలు ఎప్పుడెలా మారుతామో ఎవరికీ అర్థం కావడం లేదు. ఆర్థిక పరిస్థితి బాగా లేదు, పొదుపు పాటించమని ఒకవైపు చెబుతూనే కొత్త సచివాలయం కట్టడమెందుకో పాలకులకే తెలియాలని సామాన్య తెలంగాణ ప్రజానీకం భావిస్తున్నది. పాలమూరు ప్రాజెక్టులకైతే హైదరాబాద్లో భూములు అమ్మొచ్చు.. కానీ, చింతమడక కైతే ఏ చింతా లేదన్నట్టు తయారైంది ప్రభుత్వ వ్యవహారం అని సాధారణ తెలంగాణ ప్రజానీకం అనుకుంటున్నది. పాలముంచుతానన్నోరు కనీసం పాలమూరు నీటిలోనైనా ముంచకపోడా అని ఆశతో ప్రజలు ఎదురు చూస్తున్నారు.

అపర భగీరథుడంటే ఎట్లుండాలె?
పైనున్న గంగను కింది తెచ్చినోరు భగీరథుడు అని అందరికీ తెలిసిందే. మరి, అపర భగీరథుడంటే ఎలా ఉండాలె? అంతకుమించి చేయాలి కదా? కానీ, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది ఏమిటి? గోదావరి నీళ్లు ఎత్తి మళ్లీ గోదాట్లకే పోసి, గప్పాలు మాత్రం గంగనే దించినంతగా ఉన్నాయని అనుకుంటున్నరు సగటు ప్రజలు. భాగ్యనగరంలో గుంతల్లేని రోడ్లు చూపిస్తామని గుంతలనే రోడ్లుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆత్మ విమర్శ మాని ఆత్మ వంచన చేసుకుంటున్న సైద్ధాంతిక “ప్రకాశా”లు అప్పడేమో ఉద్యమం అన్నారు ఇప్పుడేమో రాజకీయాలు ఒంటబట్టించుకున్నారు అని విశ్లేషిస్తున్నారు. మొత్తానికి, తెలంగాణ ప్రభుత్వం ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితి నెలకొన్నది.

జీహెచ్ఎంసీ కమిషనర్ ఎందుకు మార్చిండ్రో?
జీహెచ్ఎంసీ కమిషనర్ని ఎందుకు మార్చిండ్రో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఆయన చేసిన తప్పేమిటో తెలియ రాలేదు. అయినా, అంతగా మార్చాల్సి వస్తే.. ఒక పద్ధతి ప్రకారం చేయాలి కానీ, అంత హఠాత్తుగా తీసేయడమెందుకు? అయినా, మొన్నటివరకూ తెగ పొగిడేసిన కమిషనర్ని సడెన్ గా ఎందుకు తీసేశారు? చుట్టూ ఉన్న వారి చెప్పుడు మాటలు విని తీసిపారేశాడా? మరీ, మాజీ మంత్రి కేటీఆర్ కు తెలియకుండా తీసేసినంత పాపం పని జీహెచ్ఎంసీ కమిషనర్ ఏం చేశాడో పాలకులకే తెలియాలి.

telangana political updates

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here