ఈ సంతోషం ఈసారి ఉంటుందా?

Why Trs Will Lost In Ghmc?

డిసెంబరు 1న జీహెచ్ఎంసీ ఎన్నికల్నిపెట్టి టీఆర్ఎస్ పార్టీ సెల్ఫ్ గోల్ కొట్టుకుందా? అంటే ఔననే సమాధానం వినిపిస్తుంది. పదిహేను రోజుల్లోనే ఎన్నికల్ని నిర్వహించాల్సిన అత్యవసరమేమిటని నగర ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

కర్ణుడి చావుకి లక్ష కారణాలు అన్నట్లు.. ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి పాలయ్యేందుకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఐదేళ్ల నుంచి జనాలు జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది వ్యవహార తీరు వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొత్తగా ఎవరు ఇల్లు కట్టుకున్నా.. ఈ సిబ్బంది కొంతమంది చిన్న పత్రికల రిపోర్టర్లను ఆయా భవన యజమానుల వద్దకు పంపించి డబ్బుల్ని వసూలు చేయించేవారని తెలిసింది. దక్షిణాది రాష్ట్రాలకు డబుల్ బెడ్ రూం ఇన్ఛార్జీగా వ్యవహరించే వ్యక్తిని కూడా వీళ్లు వదలలేదంటే.. అక్రమ వసూళ్లు ఏ స్థాయిలో ఉండేవో అర్థం చేసుకోవచ్చు. ఇక, శివార్లలో జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది కలిసి వాటాలు వేసుకుని మరీ కొత్తగా ఇల్లు కట్టుకునేవారిని ఇబ్బందులు పెట్టారు. ఇందులో కార్పొరేటర్ల పాత్ర గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిదని సమాచారం. అందుకే, ఈసారి కొంతమంది కార్పొరేటర్లకు టీఆర్ఎస్ టికెట్లను ఇవ్వడం లేదని సమాచారం.

– వరదల వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. నేటికీ కొన్ని ప్రాంతాల్లో పలు కుటుంబాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన పది వేలు వరద సాయం అధిక శాతం మంది ప్రజలకు అందలేదు. ఇందులోనూ దళారులు ప్రవేశించి చేతివాటం ప్రదర్శిస్తున్నారు. దీంతో, మహిళలకు, పెద్దలకు చిర్రెత్తుకొస్తున్న విషయం తెలిసిందే.

తెలంగాణ రాష్ట్రమంతటా రియల్ రంగం మీద ఆధారపడిన విషయం తెలిసిందే. భూమల విలువకు మార్కెట్ రేటుకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉండటంతో.. అధిక శాతం మంది పెట్టుబడిదారులు హైదరాబాద్లో ప్లాట్లు, భూములను కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. కాకపోతే, రెండు నెలల్నుంచి రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో రియల్ రంగంపై ఆధారపడ్డవారు తీవ్రంగా నష్టపోయారు. హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్లు ఆగిపోవడంతో ఏజెంట్లు, ప్లాట్లు, ఫ్లాట్లు కొనుకున్నవారు నానా ఇబ్బందులు పడ్డారు. ఈ రంగంపై ఆధారపడి వ్యాపారాలు నిర్వహించేవారికి బిల్డర్లు, రియల్టర్ల నుంచి సకాలంలో సొమ్ము రాక నానా అగచాట్లు పడుతున్నారు.

– మొన్న దుబ్బాకలో జరిగిన ఎన్నికల్లోనూ రియల్ రంగం మీద ఆధారపడ్డవారంతా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటేయడం గమనార్హం. ఇదే ట్రెండ్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ కొనసాగుతుంది. అందుకే, రియల్ రంగాన్ని బుట్టలో పెట్టుకునేందుకు మంత్రి కేటీఆర్ టీఎస్ బీపాస్ అనే విధానాన్ని ఆదరాబాదరాగా ఆరంభించారు. దీని వల్ల ఇళ్ల అనుమతుల్లో ఎలాంటి అక్రమాలుండవని ప్రచారం చేస్తున్నారు. అయితే, ప్రజలు మాత్రం అంత సులువుగా కేటీఆర్ మాటల్ని నమ్మడం లేదు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చలేదనే విషయాన్ని ప్రజలింకా గుర్తు పెట్టుకున్నారు. అందుకే, ఈసారి టీఆర్ఎస్ పార్టీకి గెలుపు అంత సులువేం కాదని అర్థమవుతోంది.

GHMC ELECTIONS LIVE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *